విడుదలకు సిద్దమైన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ ‘దర్శిని’ | Darshini Movie Release Date Out | Sakshi
Sakshi News home page

Darshini : విడుదలకు సిద్దమైన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ ‘దర్శిని’

May 8 2024 11:17 AM | Updated on May 8 2024 12:06 PM

Darshini Movie Release Date Out

వికాస్‌, శాంతి జంటగా, డాక్టర్‌ ప్రదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్శిని. వీ4 సినీ క్రియేషన్స్‌ పతాకంపై  డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మిస్తున్న ఈ  సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్‌ పనులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ వచ్చింది. 

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్‌ ఎల్‌ వి సూర్యం మాట్లాడుతూ.. . ‘ముగ్గురు మిత్రులకి భవిష్యత్తు నీ చూపించే యంత్రం దొరికితే దానివల్ల వచ్చే పరిణామాలు మరియూ పర్యవసానాలే మా సినిమా దర్శిని. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. ప్రతి తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుంది’ అన్నారు. 

 ‘సినిమా చాలా బాగా వచ్చింది, సెన్సార్ వారు మా చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చి సినిమా బాగుంది అని కొనియాడారు’ అని దర్శకుడు డాక్టర్‌ ప్రదీప్‌ అల్లు అన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement