breaking news
Darshini Movie
-
'దర్శిని' సినిమా రివ్యూ
వికాస్, శాంతిప్రియ జంటగా నటించిన సినిమా 'దర్శిని'. డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహించగా, ఎల్వీ సూర్యం నిర్మాత వ్యవహరించారు. సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సంతోష్(వికాస్), ప్రియ(శాంతిప్రియ), లివింగ్ స్టోన్(సత్య) ఫ్రెండ్స్. ముగ్గురూ కలిసి ఔటింగ్ కోసం సైంటిస్ట్ డాక్టర్ దర్శిని ఫామ్ హౌస్‌కి వెళ్తారు. అనుకోకుండా ఓ గదిలో సెన్సార్ ఉన్న పెన్ దొరుకుతుంది. దాని బటన్ ప్రెస్ చేయగానే స్క్రీన్‌పై భవిష్యత్ చూపిస్తుంది. మరోవైపు అదే ఫామ్ హౌస్‌లో దర్శిని శవంలా కనిపిస్తుంది. ఇకపోతే ఓ పోలీస్ తన చెల్లి కనపడట్లేదని ఇక్కడికి వస్తాడు. ముగ్గురు ఫ్రెండ్స్‌కి ఎవరో ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. అసలు దర్శిని ఎలా చనిపోయింది? ముగ్గుర్ని బెదిరించేది ఎవరు? ఆ భవిష్యత్తు మిషిన్ కథేంటి? అనేదే సినిమా స్టోరీ.(ఇదీ చదవండి: స్థల వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్)ఎలా ఉందంటే?టైమ్ ట్రావెల్ కథలు.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఇంట్రెస్ట్ కలిగిస్తుంటాయి. అలా భవిష్యత్ చూపించే మెషీన్ అనే కాన్సెప్ట్‌తో స్టోరీ బాగానే అనుకున్నారు. కానీ కథనం మాత్రం కాస్త సాగదీశారు. సైన్స్ ఫిక్షన్ కథతో పాటు ఇందులో ప్రేమకథ కూడా ఉంటుంది. ఇంటర్వెల్‌కి ముగ్గురు ఫ్రెండ్స్‌ని ఎవరో చంపబోతున్నట్టు ట్విస్ట్ ఇచ్చి, సెకండాఫ్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇక ఇంటర్వెల్ తర్వాత ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ వెళ్తారు. అయితే తక్కువ పాత్రలతో దాదాపు ఒకే ఇంట్లో సినిమా అంతా తీశారు. కొన్ని సన్నివేశాల్లో భయపెట్టారు!ఎవరెలా చేశారు?'దర్శిని'లో చేసిన వాళ్లందరూ కొత్తవాళ్లే. ప్రధాన పాత్రల్లో చేసిన వికాస్, శాంతి ప్రియ పర్వాలేదనిపించారు. లివింగ్ స్టోన్ పాత్ర చేసిన సత్య నవ్వించగా, మిగిలిన వాళ్లు ఫరిది మేరకు యాక్ట్ చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. పాటలు ఓకే. దర్శకత్వం కూడా చాలా మెరుగుపరుచుకోవాల్సింది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా) -
విడుదలకు సిద్దమైన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ ‘దర్శిని’
వికాస్, శాంతి జంటగా, డాక్టర్ ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్శిని. వీ4 సినీ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ ఎల్ వి సూర్యం మాట్లాడుతూ.. . ‘ముగ్గురు మిత్రులకి భవిష్యత్తు నీ చూపించే యంత్రం దొరికితే దానివల్ల వచ్చే పరిణామాలు మరియూ పర్యవసానాలే మా సినిమా దర్శిని. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. ప్రతి తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుంది’ అన్నారు. ‘సినిమా చాలా బాగా వచ్చింది, సెన్సార్ వారు మా చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చి సినిమా బాగుంది అని కొనియాడారు’ అని దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు అన్నారు.