Cricketer Sreeshanth in Samantha Kaathu Vaakula Rendu Kaadhal Movie - Sakshi
Sakshi News home page

Sreeshanth-Samantha: సమంత సరసన క్రికెటర్‌ శ్రీశాంత్‌!, ఏ మూవీలో తెలుసా?

Feb 10 2022 3:32 PM | Updated on Feb 10 2022 5:11 PM

Cricketer Sreeshanth In Samantha Kaathu Vaakula Rendu Kaadhal Movie - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయన్‌ సమంత, సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయతారా లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం కాతువాకుల రెండు కాదల్‌. ఇందులో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కథానాయకుడు. నయన్‌ ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. లాస్ట్‌ షెడ్యూల్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒకప్పటి టిమిండియా ఆటగాడు కీ రోల్‌ పోషిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. 

చదవండి: శంకర్‌ పిలిచి ఆఫర్‌ ఇస్తే ఆ హీరో నో చెప్పాడట, ఆ తర్వాత చూస్తే బ్లాక్‌బస్టర్‌ హిట్‌

టిమిండియా బౌలర్‌, నటుడు శ్రీశాంత్‌ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్రం బృందం వెల్లడించింది. అంతేకాదు ఈ సినిమాని అతడి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో శ్రీశాంత్‌ మహ్మద్‌ మోబీ అనే పాత్రలో కనిపించనున్నాడట. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి సమంత, నయనతార, విజయ్‌ సేతుపతిల లుక్‌ విడుదల కాగా వాటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

చదవండి: 2022 ఆగస్ట్‌ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్‌ కామెంట్స్‌ వైరల్‌

ఈ సినిమాలో శ్రీశాంత్‌, సమంత సరసన పలు సన్నివేశాల్లో కనిపించనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే  శ్రీశాంత్‌ ఓ మూవీతో హీరోగా పరిచమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేదు. ఈ క్రమంలో మరోసారి నటుడిగా నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్న శ్రీశాంత్‌కు ఇది మంచి అవకాశమని చెప్పుకోవాలి. దీనితో పాటు శ్రీశాంత్‌ మరో రెండు సినిమాల్లో నటింస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement