Director Shankar: శంకర్‌ పిలిచి ఆఫర్‌ ఇస్తే ఆ హీరో నో చెప్పాడట, ఆ తర్వాత చూస్తే బ్లాక్‌బస్టర్‌ హిట్‌

Is Hero Abbas Rejects Director Shankar Jeans Movie Offer Here Are Details - Sakshi

సెన్సెషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌తో సినిమా అంటే ఏ హీరో వద్దనడు. ఎందుకంటే ఆయన సినిమాలన్ని భారీ స్థాయిలో ఉంటాయి. కొత్త కొత్త టెక్రాలజీ శంకర్ తన సినిమాల్లో వాడతారు. అందుకే శంకర్‌ సినిమా అంటే చాలా ప్రేక్షకుల అంచనాలన్ని డబుల్‌ అయిపోతాయి. అలాంటి దర్శకుడు శంకర్‌ పిలిచి ఆఫర్‌ ఇస్తే ఓ హరో చేయనని చెప్పాడట. ఇంతకి ఆ హీరో ఎవరూ, అసలు విషయేంటో ఓసారి చూద్దాం. కమల్ హాసన్‌‌తో భారతీయుడు మూవీ తీసి భారీ హిట్ కొట్టిన డైరెక్టర్‌ శంకర్‌ ఆ తర్వాత సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కొంత గ్యాప్‌ తీసుకున్న ఆయన జీన్స్ కథ సిద్ధం చేసుకున్నాడు.

చదవండి: విడాకులపై సుమంత్‌ ఆసక్తికర కామెంట్స్‌, ఇప్పుడది కామన్‌..

ఒకే పోలికతో ఉన్న ఇద్దరు అబ్బాయిలు ఓకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్‌‌ని తీసుకొని విజువల్ వండర్‌‌గా జీన్స్ మూవీని తెరకెక్కించారు శంకర్. ముందుగా ఈ సినిమాకి హీరోగా అబ్బాస్‌‌ని అనుకున్నాడట ఆయన. అందుకే అబ్బాస్‌ను ప్రత్యేకంగా కలిసి కథ వివరించాడట. అయితే అప్పటికే ప్రేమదేశం మూవీ భారీ సక్సెస్‌ కావడంతో అబ్బాస్‌ సినిమాల పరంగా ఫుల్‌ బిజీ అయిపోయాడు. ఆ సమయంలో దాదాపుగా ఓ పది సినిమాలకి కమిట్మేంట్‌ ఇచ్చాడట. అందుకే శంకర్ ఆఫర్‌‌ని రిజెక్ట్ చేశాడట అబ్బాస్. ఇదిలా ఉంటే అదే సమంయలో శంకర్‌ ఖాతాలో భారతీయుడు తప్పితే మరో భారీ హిట్‌ లేదు.

చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘బంగార్రాజు’!, ఎక్కడంటే..

అ​ప్పుడే ప్రేమదేశం మూవీ భారీ విజయంతో మంచి ఫాంలో ఉ‍న్న అబ్బాస్‌, అప్పుడప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అబ్బాస్‌, శంకర్‌తో సినిమా చేసేందుకు సాహసం చేయలేదని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఇక అబ్బాస్‌ నో చెప్పడంతో అదే మూవీ హీరో అజిత్‌‌ని అనుకున్నాడు శంకర్. కానీ కాల్షీట్ల కారణంగా జీన్స్ మూవీని పక్కన పెట్టాడు అజిత్.. చివరికి జీన్స్‌ స్క్రీప్ట్‌ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే ప్రేమికుడు, ప్రేమదేశం మూవీ ఆఫర్ లని మిస్ చేసుకొని బాధపడుతున్న ప్రశాంత్‌‌కి ఇది మంచి ఆఫర్.

అందుకే అప్పటికే కమిట్ అయిన ఏడు సినిమాలను కూడా కాదనుకొని శంకర్‌‌కు డేట్స్ ఇచ్చాడట హీరో ప్రశాంత్. 4 ఏప్రిల్ 1998 సంవత్సరం విడుదలైన జీన్స్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా సూపర్ హిట్ కావడం విశేషం. ఐశ్వర్యరాయ్‌ని ఎనిమిదో వింతగా చూపిస్తూ ప్రపంచంలోని ఏడు వింతలను ఆయా ప్రదేశాల్లో చూపిస్తూ ‘పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం’ అనే పాటను చిత్రీకరించాడు శంకర్.  ఈ ఒక్క పాట కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు చేశారాయన.. అప్పట్లో దీని గురించి ఇంటర్నేషనల్ మీడియా కూడా రాసింది. ఈ సినిమా తర్వాత ఐశ్వర్యరాయ్‌ ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top