ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం : బ్రహ్మానందం | Comedian Brahmanandam Talk About Upendra Gaadi Adda Movie | Sakshi
Sakshi News home page

ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం : బ్రహ్మానందం

Oct 31 2023 4:29 PM | Updated on Oct 31 2023 4:40 PM

Comedian Brahmanandam Talk About Upendra Gaadi Adda Movie - Sakshi

‘‘ఒక సినిమా తీయడానికే ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు తీస్తుండటం ఓ సంచలనం. తన కుమారుడు ఉపేంద్రని హీరోగా పరిచయం చేయడంతో  పాటు ఒకేసారి అతనితో ఐదు సినిమాలు తీస్తున్న అచ్యుతరావుకి అభినందనలు. దీనివల్ల పరిశ్రమను నమ్ముకున్నవారికి అవకాశాలు ఇచ్చి, భోజనం పెట్టినట్లవుతుంది. ‘ఉపేంద్రగాడి అడ్డా’ మంచి హిట్టవ్వాలి’’ అని సీనియర్‌ నటుడు బ్రహ్మానందం అన్నారు.

కంచర్ల ఉపేంద్ర, సావిత్రీ కృష్ణ జంటగా ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌కే దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఎస్‌ఎస్‌ఎల్‌ఎస్‌ క్రియేషన్స్‌పై కంచర్ల అచ్యుతరావు నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై, ‘ఉపేంద్రగాడి అడ్డా’ ట్రైలర్‌ను, ‘1920 భీమునిపట్నం’ ΄ోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ఉపేంద్ర హీరోగా ఇదే బ్యానర్‌లో తీస్తున్న ఐదు సినిమాల టీజర్లను విడుదల చేశారు.

కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో నవంబర్‌ నుంచి ప్రతీ నెల ఒక సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘నా పుట్టిన రోజుకి ఇది వెలకట్టలేని పెద్ద బహుమతి’’ అన్నారు కంచర్ల ఉపేంద్ర. ‘‘సోషల్‌ మీడియా నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తోందో మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం’’ అన్నారు ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌కే. హీరోయిన్‌ సావిత్రీ కృష్ణ, సహనిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement