టాలీవుడ్ కమెడియన్ అలీ పెళ్లి వేడుక.. సెలబ్రేషన్స్ చూశారా! | Comedian Ali Marriage Day Celebrations Video Goes Viral | Sakshi
Sakshi News home page

Ali: టాలీవుడ్ కమెడియన్ అలీ పెళ్లి వేడుక.. వీడియో వైరల్!

Jan 28 2025 4:02 PM | Updated on Jan 28 2025 4:59 PM

Comedian Ali Marriage Day Celebrations Video Goes Viral

టాలీవుడ్ కమెడియన్ నటుడు అలీ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో తన కామెడీతో అభిమానులను ఎంటర్‌టైన్ చేశారు. తెలుగులో స్టార్‌ కమెడియన్‌గా ఎదిగారు. హీరోగా, హీరో స్నేహితుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా విభిన్న పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ తెలుగు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన.. సీతాకోకచిలుక చిత్రం ద్వారా హీరోగా మారారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

జుబేదాను పెళ్లాడిన అలీ..

అయితే జుబేదాను పెళ్లాడిన అలీకి ఇద్దరు కుమార్తెలు ఉ‍న్నారు. 2022 డిసెంబర్‌లో పెద్దకూతురు ఫాతిమా పెళ్లిని గ్రాండ్‌గా చేశారు. ఈ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరలయ్యాయి. ‍అయితే తాజాగా ‍అలీ సైతం మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో మనం కూడా చూసేద్దాం.

గ్రాండ్‌గా అలీ పెళ్లి వేడుక..

ఇటీవల తన పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు అలీ దంపతులు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మరోసారి వివాహా వేడుక జరుపుకున్నారు. తమ ఇద్దరు కూతుర‍్ల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియో జుబేదా అలీ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. వారి సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement