Megastar Chiranjeevi Emotional Comments About Director Bobby - Sakshi
Sakshi News home page

Chiranjeevi: తండ్రి చనిపోయి కొండంత శోకంలో.. అయినా షూటింగ్‌కు వచ్చాడు

Jan 12 2023 4:48 PM | Updated on Jan 12 2023 5:57 PM

Chiranjeevi Emotional Comments On Director Bobby - Sakshi

తండ్రి కోసం అంతలా పరితపించే మనిషి నాన్న చనిపోయిన రెండు రోజులకే షూటింగ్‌కు వచ్చాడు. ఆయన పెద్ద కర్మ అయిపోయేవరకు రాకపోవడమే న్యాయమని మేము భావించాం

సినిమాను ప్రాణం పెట్టి తీస్తారు దర్శకనిర్మాతలు. సినిమా ఆడిందంటే సంతృప్తి చెందుతారు, ఆడలేదంటే తర్వాతి మూవీని మరింత కసిగా తెరకెక్కిస్తారు. సినిమా రిలీజ్‌ కోసం అభిమానులెంతగా పడిగాపులు కాస్తారో అంతకంటే వేయిరెట్లు ఎక్కువ ఆతృతతో ఎదురుచూస్తుంటారు డైరెక్టర్స్‌. తమ వ్యక్తిగత కష్టనష్టాలను పక్కనపెట్టి పూర్తిగా సినిమా కోసమే పరితపిస్తుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బాబీ. తండ్రి చనిపోయి కొండంత శోకంలో ఉన్నా కూడా రెండు రోజుల్లో తిరిగి వాల్తేరు వీరయ్య సెట్‌కు వెళ్లి షూటింగ్‌ మొదలుపెట్టాడు ఆయన. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పుకొచ్చాడు. 

'బాబీ తన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తాడు. తండ్రి కోసం అంతలా పరితపించే మనిషి నాన్న చనిపోయిన రెండు రోజులకే షూటింగ్‌కు వచ్చాడు. ఆయన పెద్ద కర్మ అయిపోయేవరకు రాకపోవడమే న్యాయమని మేము భావించాం. కానీ అతడు మాత్రం చిన్నకర్మ పూర్తికాగానే నెక్స్ట్‌ డే షూటింగ్‌కు వచ్చాడు. మేమంతా ఆశ్చర్యపోయాం. మీతో పని చేయడం వల్ల నాన్నగారి నిష్క్రమణను కూడా మర్చిపోయాను. మీ సాంగత్యంలో ఆ బాధ తెలియలేదు అని అతడు నాతో ఎన్నోసార్లు చెప్పాడు. సినిమా కోసం చివరి నిమిషం వరకు కష్టపడ్డాడు. అతడి శ్రద్ధాసక్తులు చూస్తే ముచ్చటేసింది. అందుకే స్టేజీపై అతడిని ముద్దుపెట్టుకున్నా' అన్నాడు చిరంజీవి.

చదవండి: నాపై విషప్రయోగం జరిగింది, చేసింది అతడే: మెగాస్టార్‌
థియేటర్‌లో పూజారి మాస్‌ డ్యాన్స్‌

Advertisement
 
Advertisement
Advertisement