Megastar Chiranjeevi Open about His Fan Doing Silly Trick on Him - Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: నాపై అభిమానే విష ప్రయోగం చేశాడు: చిరంజీవి

Jan 12 2023 2:18 PM | Updated on Jan 12 2023 3:15 PM

Megastar Chiranjeevi Open About His Fan Doing Silly Trick On Him - Sakshi

మెగాస్టార్ చిరంజీవిపై విష ప్రయోగం జరిగిందా? ఆయనపై ఓ ‍ అభిమాని చేసిన ప్రయోగం ప్రాణాల మీదకు తీసుకొచ్చిందా? దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మెగాస్టార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ అభిమాని పిచ్చి వల్ల ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..  మరణమృదంగం సినిమా షూటింగ్ సమయంలో ఓ అభిమాని చేసిన పని తన ప్రాణాల మీదకు తెచ్చిందన్నారు మెగాస్టార్. ఓ అభిమాని కేక్ తెచ్చి బలవంతంగా నోట్లో పెట్టారని తెలిపారు. ఆ కేక్ చేదుగా అనిపించడంతో వెంటనే తినకుండా పడేసినట్లు వెల్లడించారు. ఆ సమయంలో సెట్లో ఉన్నవారితో ఈ విషయం చెప్పగా అసలు విషయం బయటకొచ్చింది. అతన్ని పట్టుకుని నాలుగు తగిలిస్తే నిజం చెప్పాడని తెలిపారు. ‍అది విని అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారని తెలిపారు. అతన్ని పట్టించుకోలేదనే తనపై వశీకరణ ప్రయోగం చేసినట్లు ఆ అభిమాని వివరించారు. కానీ చిరుకి హాని తలపెట్టినా కూడా అతన్ని క్షమించి వదిలేసినట్లు వెల్లడించారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ మాట్లాడూతూ..' తన అభిమాని నాపై విషప్రయోగం చేయడం జరిగింది. అతను నాకు పిచ్చి అభిమాని. మరణమృదంగం షూటింగ్‌లో కేక్ కట్ చేశాం. అ సమయంలో అతను చేత్తో నాకు కేక్ తినిపించారు. స్పూన్‌తో తినడం నాకు అలవాటు. ఆ తర్వాత నాకు చేదుగా అనిపించడంతో బయట పడేశా. దీంతో వెంటనే రామారావు అతన్ని పట్టుకున్ని కేక్ శాంపిల్ టెస్టింగ్‌కు పంపారు. ఆ తర్వాత అతన్ని రామారావు కొట్టారు. దీంతో అతను తప్పు ఒప్పుకున్నారు. నాతో చిరంజీవి తనతో మాట్లాడటం లేదని అలా చేశాడట. కేరళ నుంచి ఏదో వశీకరణం పౌడర్ తీసుకొచ్చినట్లు తెలిపారు. నేను వెంటనే అతన్ని క్షమించి వదిలేశా.' అని అన్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement