ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఒకప్పటి బాలనటి | Child Artist Jhanak Shukla Married Swapnil Suryawanshi | Sakshi
Sakshi News home page

Jhanak Shukla: బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లాడిన ప్రముఖ నటి

Dec 14 2024 12:53 PM | Updated on Dec 14 2024 1:21 PM

Child Artist Jhanak Shukla Married Swapnil Suryawanshi

20 ఏళ్ల క్రితం బాలనటిగా బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న జనక్ శుక్లా పెళ్లి చేసుకుంది. ఎప్పటినుంచో ప్రేమిస్తున్న స్వప్నిల్ సూర్యవంశీతో ఏడడుగులు వేసింది. డిసెంబరు 12న ఈ వివాహం జరగ్గా.. తాజాగా పెళ్లి వీడియోని సోషలో మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: మోహన్ బాబు పరారీలో ఉన్నాడా?)

'కుంకుమ భాగ్య' సీరియల్ నటిగా అందరికీ తెలిసిన సుప్రియ శుక్లా కూతురే జనక్ శుక్లా. 'సన్ పరి' సీరియల్‌తో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈ చిన్నది.. షారుక్ ఖాన్ 'కల్ హో నా హో' సినిమాలో ప్రీతి జింటా చెల్లిగా అద్భుతమైన యాక్టింగ్ చేసింది. అయితే కొన్నాళ్లకు యాక్టింగ్ పక్కనబెట్టేసింది. చదువు పూర్తయిన తర్వాత నటనపై ఆసక్తి లేకపోవడంతో లైట్ తీసుకుంది.

ఎంబీఏ చేసిన జనక్.. కొన్నేళ్లుగా స్వప్నిల్‌తో ప్రేమలో ఉంది. ఇతడు మెకానికల్ ఇంజినీర్. కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన వీళ్లిద్దరూ ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement