వినోదానికి ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతున్నారు: చేతన్ కృష్ణ | Chetan Krishna about Dhoom Dhaam Movie | Sakshi
Sakshi News home page

వినోదానికి ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతున్నారు: చేతన్ కృష్ణ

Nov 10 2024 2:51 AM | Updated on Nov 10 2024 2:51 AM

Chetan Krishna about Dhoom Dhaam Movie

‘‘ధూం ధాం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా బాగుంటే తప్ప థియేటర్స్‌కి రాని ఈ ట్రెండ్‌లో మా సినిమా ఆడుతున్న థియేటర్లు 70 నుంచి 80 శాతం మంది ప్రేక్షకులతో నిండటం సంతోషంగా ఉంది. మా చిత్రంలోని వినోదానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతున్నారు’’ అని హీరో చేతన్‌ కృష్ణ అన్నారు. సాయి కిషోర్‌ మచ్చా దర్శకత్వంలో చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ జోడీగా నటించిన చిత్రం ‘ధూం ధాం’.

ఫ్రైడే ఫ్రేమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో సాయి కిషోర్‌ మచ్చా మాట్లాడుతూ– ‘‘ధూం ధాం’ రిలీజైన ప్రతి సెంటర్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘పెద్ద సినిమాల పోటీలో మా ‘ధూం ధూం’లాంటి చిన్న సినిమా నిలదొక్కుకోవడమే గొప్ప విషయం’’ అన్నారు ఎంఎస్‌ రామ్‌ కుమార్‌. రచయిత గోపీ మోహన్ , నటుడు గిరిధర్‌ మాట్లాడారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement