అవ్వ!!! ఇంతకన్న వెన్నుపోటు ఉంటుందా?.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌ | Chandrababu Naidu Arrest: Ram Gopal Varma Satirical Tweet On TDP Bandh Call In AP, Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: అవ్వ!!! ఇంతకన్న వెన్నుపోటు ఉంటుందా?.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

Sep 12 2023 12:05 PM | Updated on Sep 12 2023 1:33 PM

Chandrababu Naidu Arrested: Ram Gopal Varma Interesting Tweet on TDP Bandh Call - Sakshi

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన బంద్‌ పిలుపునకు ప్రజలెవరూ స్పందించలేదు. సోమవారం రాష్ట్ర ప్రజలు యథావిధిగా తమ పనులు చేసుకున్నారు. టీడీపీ పార్టీలోనూ దీనిపై పెద్దగా స్పందన లభించలేదు. మీడియా కోసమే అన్నట్లుగా ఓ పది మంది కలిసి కాసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. టీడీపీ బంద్‌ పూర్తిగా విఫలం కావడంపై ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తనదైన శైలీలో స్పందించాడు. చంద్రబాబుకు అలా వెన్నుపోటు పొడుస్తారా అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. 

(చదవండి: స్కిల్‌ స్కామ్‌లో మీకేమర్థమైంది?: పవన్‌కు ఆర్జీవీ సూటి ప్రశ్నలు)

‘మై నాట్ డియర్ ఏపి ప్రజలారా, నలభై సంవత్సారాల నుంచి ఓక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని , లోపలికేసినందుకు బంద్ కి పిలిస్తే , ఏ మాత్రం కేర్ చెయ్యకుండా మీ పనులు చేసుకుంటూ , సినిమాలు చూసుకుంటూ,   షాపింగ్లు చేసుకున్నారా ??? అవ్వ !!! ఇంత కన్నా వెన్నుపోటు ఉంటుందా?’అని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆర్జీవీ ట్వీట్‌పై నెటిజన్స్‌ కూడా వ్యంగ్యంగానే స్పందిస్తున్నారు. ‘వెన్నుపోటు గురువుకే వెన్నుపోటు’, ‘ఆకరికి హెరిటేజ్ వాళ్ళు కూడా బంద్ చేయకుండా వెన్ను పోటు పొడిచారు’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement