రామ్‌చరణ్‌,వెంకటేష్‌ కోసం వారిద్దరూ ఆలోచిస్తే మేము తగ్గాల్సిందే‌: దర్శకుడు | Chandoo Mondeti Comments On Thandel Movie Release Date | Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌,వెంకటేష్‌ కోసం వారిద్దరూ ఆలోచిస్తే 'తండేల్‌'కు బ్రేక్‌: దర్శకుడు

Oct 29 2024 1:53 PM | Updated on Oct 29 2024 3:35 PM

Chandoo Mondeti Comments On Thandel Movie Release Date

నాగచైతన్య హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ సినిమా 'తండేల్‌' కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల గురించి తాజాగా దర్శకుడు చందూ మొండేటి క్లారిటీ ఇచ్చారు.

'తండేల్‌' షూటింగ్‌ గురించి మాట్లాడుతూ దర్శకుడు చందూ  ఇలా చెప్పుకొచ్చారు. 'సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి అయింది. జనవరిలో విడుదల చేసేందుకు మేము రెడీగా ఉన్నాం. ఇంకో పదిరోజులు షూట్‌ చేస్తే సినిమా పూర్తి అవుతుంది. కానీ, చరణ్ గారి సినిమా వస్తుందని అరవింద్ గారు.. వెంకీ మామ సినిమా వస్తుందని చైతూ గారు ఆలోచిస్తే.. మాత్రం సంక్రాంతి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. జనవరి 26న విడుదల చేద్దామనుకుంటే  ఆదివారం కాబట్టి అవకాశం లేదు. సంక్రాంతి కంటే ముందే రిలీజ్‌ చేయాలంటే సినిమా పూర్తి కాదు.' అని  చందూ మొండేటి తెలిపారు.

తండేల్‌ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలోనే విడుదలయ్యే ఛాన్స్‌ ఉంది. 'లవ్‌ స్టోరీ' చిత్రం తర్వాత  నాగచైతన్య,  సాయి పల్లవి కలిసి నటిస్తున్న రెండో చిత్రం. ఈ మూవీలో ఆమె డీగ్లామర్‌ పాత్రలో కనిపించనుంది. అయితే.. చైతూ- చందు మొడేటి కాంబినేషన్‌లో మూడో చిత్రంగా తండేల్‌ రానుంది. వారిద్దరి నుంచి ఇప్పటికే ప్రేమమ్‌, సవ్యసాచి చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement