'సి 202' హారర్‌ మూవీ.. ఈ నెలలోనే రిలీజ్‌ | C 202 Horror Movie Release Date Out | Sakshi
Sakshi News home page

ఒక్క డైలాగ్‌ లేకుండా హారర్‌ మూవీ ట్రైలర్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Oct 7 2024 7:23 PM | Updated on Oct 7 2024 7:47 PM

C 202 Horror Movie Release Date Out

ఇప్పుడు ఆడియెన్స్ అంతా కూడా కొత్త కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న చిత్రాలనే ఆదరిస్తున్నారు. ఈక్రమంలో విభిన్నమైన కాన్సెప్ట్, టైటిల్‌తో తెరకెక్కిన మూవీ ‘సి 202’. పూర్తి నైట్ ఎఫెక్ట్స్‌లోనే ఈ సినిమాను చిత్రీకరించారు. మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. 

గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించింది. మైటీ ఓక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె ఎ నిర్మిస్తున్నాడు. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. 

ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ ప్రకటించారు. అక్టోబర్ 25న విడుదల చేస్తున్నామంటూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement