విజయ్‌కి జోడిగా సమంత.. నాలుగో సారి! | Buzz: Samantha To Play Key Role In Thalapathy Vijay's 69th Film | Sakshi
Sakshi News home page

విజయ్‌కి జోడిగా సమంత.. నాలుగో సారి!

Jul 4 2024 11:07 AM | Updated on Jul 4 2024 5:06 PM

Buzz: Samantha To Play Key Role In Thalapathy Vijay's 69th Film

‘కత్తి’ (2014), ‘తేరీ’ (2016), ‘మెర్సల్‌’ (2017) చిత్రాల తర్వాత హీరో విజయ్‌–హీరోయిన్‌ సమంత మళ్లీ జోడీగా కనిపించే అవకాశం ఉందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. విజయ్‌ హీరోగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో  హీరోయిన్‌గా ఇప్పటికే మృణాల్‌ ఠాకూర్, పూజా హెగ్డే వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. 

తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. ఇటీవల సమంతకు హెచ్‌. వినోద్‌ ఈ సినిమా స్టోరీ లైన్‌ చెప్పారట. కథ, ఇందులోని పాత్ర నచ్చడంతో సమంత ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఇక ఈ సినిమా తర్వాత విజయ్‌ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. సో.. విజయ్‌ నటించే చివరి సినిమా ఇదే అవుతుంది. ఆల్రెడీ విజయ్‌తో మూడు సినిమాలు చేసిన సమంత ఆయన చివరి సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తారా? విజయ్‌–  సమంతల జోడీ నాలుగోసారి రిపీట్‌ అవుతుందా అనే ప్రశ్నకు సమాధానం కొన్ని రోజుల్లో తెలిసి పోతుంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement