ఆ పెయిన్‌ నాకు తెలుసు: అల్లు శిరీష్‌ | Buddy will entertain you all on August 2nd: Allu Sirish | Sakshi
Sakshi News home page

ఆ పెయిన్‌ నాకు తెలుసు: అల్లు శిరీష్‌

Aug 2 2024 12:06 AM | Updated on Aug 2 2024 12:06 AM

Buddy will entertain you all on August 2nd: Allu Sirish

‘‘ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడాన్ని ఇష్టపడను. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాను. అందుకే నా సినిమాలు కాస్త ఆలస్యంగా థియేటర్స్‌లోకి వస్తున్నాయి. కొంత బ్యాడ్‌ ప్లానింగ్‌ కూడా కారణం అనిపిస్తోంది. సాధారణంగా చిన్న, పెద్ద... ఏ సినిమా అయినా సరే అనుకున్న సమయానికి దాదాపు పూర్తి కావడం లేదు. ఎంతో కొంత ఆలస్యం అవుతున్నాయి’’ అని అల్లు శిరీష్‌ అన్నారు. అల్లు శిరీష్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’.  కేఈ జ్ఞానవేల్‌ రాజా, అధనా జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో అల్లు శిరీష్‌ చెప్పిన సంగతులు.

‘బడ్డీ’ కథను దర్శకుడు శామ్‌ చెప్పినప్పుడు టెడ్డీ బేర్‌ పాయింట్‌తో ఆల్రెడీ తమిళంలో ‘టెడ్డీ’, ఇంగ్లిష్‌లో మరో మూవీ ఉందని చెప్పాను. ‘బడ్డీ’ కథ విన్నాక ఓటీటీలో ‘టెడ్డీ’ చూడండి... కచ్చితంగా ‘బడ్డీ’ కొత్తగా అనిపిస్తుందని శామ్‌ అన్నారు. దీంతో ‘బడ్డీ’ కథ విన్నాను. టెడ్డీ బేర్‌లోకి ప్రాణం రావడం అనే పాయింట్‌ తప్ప మిగతా అంతా కొత్తగా అనిపించింది. హీరో, విలన్‌కు మధ్య ఉండే ఘర్షణ, హీరో క్యారెక్టరైజేషన్, లవ్‌ స్టోరీ... అంతా కొత్తగా డిజైన్‌ చేసినట్లనిపించింది. అందుకే ‘బడ్డీ’ ఒప్పుకున్నాను. 

‘బడ్డీ’ పోస్టర్‌ బయటకు రాగానే ఇది తమిళ మూవీ ‘టెడ్డీ’కి రీమేక్‌ కదా అనే కామెంట్స్‌ వినిపించాయి. ‘కాదు... మేం కష్టపడి స్ట్రయిట్‌గా చేసిన తెలుగు సినిమా’ అని చెప్పడమే మాకు సవాల్‌గా అనిపిస్తోంది. మేం ఎంత చెప్పినా రీమేక్‌ అని కామెంట్స్‌ చేసేవారు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిని మార్చలేం. 

‘బడ్డీ’ని గతేడాది డిసెంబరులోనే రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ టెడ్డీ బేర్‌ ఎమోషన్స్, లుక్స్‌తో పాటు సినిమాలో మూడువేలకు పైగా గ్రాఫిక్స్‌ షాట్స్‌ ఉన్నాయి. వీటిని కరెక్ట్‌గా చేయించాలంటే చేసే ఆర్టిస్టులకు సమయం ఇవ్వాలి. అందుకే రిలీజ్‌ ఆలస్యమైంది. ∙కథగా చెప్పాలంటే ‘బడ్డీ’ లవ్‌స్టోరీ. హీరో పైలట్‌. హీరోయిన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌. హీరోయిన్‌కు హీరో తెలుసు. కానీ హీరోకు హీరోయిన్‌ తెలియదు. ఫైనల్‌గా వీరి లవ్‌స్టోరీ ఏమైంది? మధ్యలో ‘బడ్డీ’ క్యారెక్టర్‌ ఏంటి? అన్నది కథ. 

జ్ఞానవేల్‌ రాజాగారు సినిమాను రిచ్‌గా నిర్మించారు. నాకుప్రోడక్షన్‌లో కాస్త అనుభవం ఉంది. కానీ నేను హీరోగా చేసే  సినిమాలప్రోడక్షన్‌ విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకోను. ఓ ప్రముఖ నిర్మాత (అల్లు అరవింద్‌) తనయుడిగా,ప్రోడక్షన్‌ గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా వేస్ట్‌ప్రోడక్షన్‌ వల్ల కలిగే పెయిన్‌ నాకు తెలుసు. అందుకే వృథా ఖర్చుని ్రపోత్సహించను.

Advertisement
 
Advertisement
Advertisement