టాలీవుడ్ హీరోను కలిసిన బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్.. ఎందుకంటే! | British Deputy Commissioner Met Tollywood Hero Nani | Sakshi
Sakshi News home page

Hero Nani: నానిని కలిసిన బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్.. ఎందుకో తెలుసా!

Mar 26 2024 7:09 PM | Updated on Mar 26 2024 7:29 PM

British Deputy Commissioner Met Tollywood Hero Nani - Sakshi

టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది దసరా, హాయ్‌ నాన్న చిత్రాలతో హిట్ కొట్టిన హీరో వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక ఆరుల్ మోహన్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో డిఫెరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న రెండో సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎస్‌జే సూర్య కీలక పాత్రలో పోషిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. తాజాగా నేచురల్ స్టార్‌ నానిని బ్రిటిష్‌ డిప్యూటీ కమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ కలిశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. హైదరాబాద్‌లోని నాని నివాసానికి వెళ్లిన గారెత్ విన్ ఓవెన్ నానితో కాసేపు ముచ్చటించారు. నాని సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్నానని ఆయన పోస్ట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్‌ సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాని నటించిన ఏవైనా రెండు సినిమాలు చూసేందుకు సలహా ఇవ్వమని నెటిజన్లను  కోరారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సరిపోదా శనివారం మూవీని తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement