కన్నడ హిట్‌ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ | Boys Hostel Trailer Launch Event | Sakshi
Sakshi News home page

కన్నడ హిట్‌ సినిమా తెలుగులో రిలీజ్.. ఎప్పుడంటే?

Aug 20 2023 4:59 AM | Updated on Aug 20 2023 6:54 AM

Boys Hostel Trailer Launch Event - Sakshi

అనురాగ్, రష్మి, శరత్, నితిన్‌ కృష్ణమూర్తి, సుప్రియ

ప్రజ్వల్‌ బీపి, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్‌ జయన్న ఉర్స్‌ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’. నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 21న రిలీజై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ తెలుగులో ఈ నెల 26న రిలీజ్‌ చేస్తున్నాయి.

ఈ సందర్భంగా ‘బాయ్స్‌ హాస్టల్‌’ ట్రైలర్‌ను ‘బేబీ’ చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. దర్శకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ– ‘‘కన్నడంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులోనూ ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ ఫన్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా అనిపించి, తెలుగులో విడుదల చేయాలని భావించాం’’ అన్నారు సుప్రియ. ‘‘బాయ్స్‌ హాస్టల్‌’ క్రేజీ ఫిల్మ్‌’’ అన్నారు నిర్మాతలు శరత్, అనురాగ్‌.

Advertisement
 
Advertisement
Advertisement