తూర్పుగోదావరి: స్థానిక యూనియన్ బ్యాంకులో రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఆర్‌డీఓ)గా పనిచేస్తున్న గానుగపెంట సుప్రియ (28) మృతదేహం గురువారం లభ్యమైంది. ఈ నెల 17న బ్యాంకులో మొబైల్ ఫోన్, చొప్పెల్ల లాకుల వద్ద తన స్కూటర్, తాళం, పాదరక్షలు, కళ్లజోడు వదిలి అదృశ్యమైన సుప్రియ నాలుగు రోజుల అనంతరం తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని కాలేరు వద్ద కోరంగి పంట కాలువలో శవమై తేలింది.
ఆమె అదృశ్యమైనప్పటి నుంచి స్థానిక పోలీసులు ఎన్ని విధాల గాలించినా ఫలితం లేకపోయింది. చివరకు స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఈ సమాచారాన్ని కడప జిల్లాలోని సింగారెడ్డిపల్లిలోని కుటుంబ సభ్యులకు బ్యాంకు అధికారులకు తెలియజేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై జి.నరేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బ్రాంచిలో చేరిన మూడు నెలల్లోనే.. శవమై
సుప్రియ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట యూనియన్ బ్యాంకు శాఖ నుంచి ఆలమూరు శాఖకు వచ్చిన మూడు నెలల్లోనే తూర్పు డెల్టా ప్రధాన కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అవసరమైతే తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదని సహోద్యోగులు తెలిపారు. ఆమె తన తల్లితో కలిసి స్థానిక పోలీసు స్టేషన్ ఎదుటి వీధిలో నివసిస్తున్నారు. ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. ఆమె మృతితో సహోద్యోగులు విచారం వ్యక్తం చేశారు.
చదవండి: వాషింగ్‌మిషన్ ప్లగ్ తీసేందుకు వెళ్లి..


