సాక్షి, అమరావతి: ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. వచ్చే మంగళవారం రూ.2,600 కోట్లు బడ్జెట్ అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం ద్వారా విక్రయించడంతో ఈ మొత్తం అప్పును ఆర్‌బీఐ సమీకరించి ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది.


