'చిన్ననాటి కల నెరవేరింది.. అత్తారింటికి దారేది నటుడు పోస్ట్'! | Boman Irani Attends French Open 2025, Shares As Birthday Surprise Gift From Family, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Boman Irani: చిన్నప్పటి కల తీరింది.. బర్త్‌ డే సర్‌ప్రైజ్‌ అంటూ పోస్ట్!

Jun 8 2025 7:22 PM | Updated on Jun 9 2025 12:43 PM

Boman Irani attends Shares as birthday surprise gift from family

అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న స్టార్‌ నటుడు బోమన్ ఇరానీ. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. కొత్త ఏడాదిలో ది మెహతా బాయ్స్‌ సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఆయన.. తాజాగా నటిస్తోన్న చిత్రం 'తన్వి ది గ్రేట్'.  అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఆయన కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రంలో  నటి శుభంగి దత్ టైటిల్ రోల్‌లో నటించింది. ఈ చిత్రాన్ని ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 18న థియేటర్లో సందడి చేయనుంది.

ఇక బోమన్ ఇరానీ సినిమాల సంగతి పక్కనపడితే.. ఆయన వ్యక్తిగతంగానూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా తన చిన్ననాటి కల నేరిందని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ప్రత్యేక పుట్టినరోజున నా కలను సాకారం చేసిన తన కుటుంబానికి  కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రెంచ్ ఓపెన్‌ చూడాలనుకున్న తన కలను నేరవేర్చినందుకు తన భార్య జెనోబియా, కుమారులు దనేశ్, కయోజ్ ఇరానీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సర్‌ప్రైజ్‌ను వారంతా కలిసి తన పుట్టినరోజుకు ప్లాన్‌ చేసి మరి బహుమతిగా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement