ఖరీదైన అపార్ట్‌మెంట్‌ కొన్న సైప్ అలీ ఖాన్ మాజీ భార్య.. ఎన్ని కోట్లంటే? | Bollywood Actress Amrita Singh Buys Luxury Apartment In Mumbai | Sakshi
Sakshi News home page

Amrita Singh: లగ్జరీ ఫ్లాట్‌ కొనుగోలు చేసిన అమృతా సింగ్.. ధర ఎన్ని కోట్లంటే?

Feb 18 2025 4:44 PM | Updated on Feb 18 2025 4:54 PM

Bollywood Actress Amrita Singh Buys Luxury Apartment In Mumbai

ప్రముఖ బాలీవుడ్ నటి అమృతా సింగ్ ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఈ లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నట్లు తెలుస్తోంది. ఈ విలాసవంతమైన అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ.18 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. కాగా.. అమృతా సింగ్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత వీరిద్దరు విడిపోయారు. వీరిద్దరికీ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్‌ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.

కాగా.. అమృతా సింగ్ బేతాబ్ (1983) చిత్రంతో  అరంగేట్రం చేశారు. ఈ  సినిమాతోనే బాలీవుడ్‌లో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మార్డ్, నామ్, చమేలి కి షాదీ, రాజు బన్ గయా జెంటిల్‌మన్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్నారు. కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె కలియుగ్, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా వంటి చిత్రాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఐనా చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది, తరువాత ఆమె 2 స్టేట్స్‌ మూవీలో ఆమె పాత్రకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement