ఆ ఆనవాయితీ రిపీట్‌! తనే ఎలిమినేట్‌ కానుందా? | Bigg Boss Telugu 8: Is Bezawada Bebakka Eliminated for First Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: ఆ ఇద్దరిలో తనపైనే ఎలిమినేషన్‌ కత్తి?

Published Sat, Sep 7 2024 5:46 PM | Last Updated on Sat, Sep 7 2024 11:02 PM

Bigg Boss Telugu 8: Is Bezawada Bebakka Eliminated for First Week

బిగ్‌బాస్‌ షోలో ఓ ఆనవాయితీ ఉంది. అదేంటంటే.. కిచెన్‌లో అడుగుపెట్టారంటే చాలు వారు ఎలిమినేషన్‌కు దగ్గరవుతున్నట్లే! అలా వంటగదిలో గరిటె తిప్పిన ఎంతోమంది మొదటివారమే ఇంటికి వెళ్లిపోయారు. ఈసారి కూడా అదే రిపీట్‌ అయ్యేట్లు కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్‌లో పృథ్వి, విష్ణుప్రియ, నాగమణికంఠ, బేబక్క, సోనియా, శేఖర్‌ బాషా ఉన్నారు. 

టాప్‌ ప్లేస్‌లో మణికంఠ
వచ్చిన మొదటిరోజు నుంచే తన గతాన్ని తవ్వి ఏడుస్తూ, జనాల్ని ఏడిపిస్తూ మణికంఠ ఓట్లు రాబట్టేశాడు. అంతేకాదు, సోషల్‌ మీడియా ఓటింగ్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఇంట్లో ఉన్న కన్నడ బ్యాచ్‌కు గట్టి పోటీనిచ్చేలా ఉందని సోనియాకు కూడా అంతో ఇంతో ఓట్లు గుద్దుతున్నారు. విష్ణుప్రియకు ఆల్‌రెడీ ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ ఉంది. 

చివరి స్థానంలో బేబక్క
బాషా తన కామెడీతో జనాలకు పిచ్చెక్కిస్తున్నాడు. ఇవేం జోకులురా బాబూ అనుకుంటూనే, ఇలాంటివాడు హౌస్‌లో ఉండాలంటూ ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. మిగిలింది బేబక్క, పృథ్వి. ఈ ఇద్దరిలో పృథ్వి ముక్కుసూటిగా మాట్లాడుతూ మెప్పిస్తున్నాడు. బేబక్క వంటతో హౌస్‌మేట్స్‌ కడుపునింపినా ప్రేక్షకులకు ఏమాత్రం వినోదం ఇవ్వడం లేదు.

తనే ఎలిమినేట్‌?
దీంతో ఈమె హౌస్‌లో ఉన్నా, లేకున్నా ఒకటే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు తక్కువ ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఈ వారం తనే ఎలిమినేట్‌ అయినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉంది? ఎలిమినేషన్‌ జరిగిందా? లేదంటే వినాయక చవితి పండగ సందర్భంగా నో ఎలిమినేషన్‌ అని ట్విస్ట్‌ ఇచ్చారా? అనేది చూడాలి.

చదవండి: ఏం చేస్తున్నారో అర్థమవుతోందా? మండిపడ్డ ఆలియా భట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement