వీడియోతో దొరికిపోయిన తేజ.. బయటకు పంపించేద్దామంటూ పనిష్మెంట్‌! | Bigg Boss Telugu 7 Latest Promo: Nagarjuna Fires On Tasty Teja, Sandeep And Shivaji, Contestants Are Left Speechless - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu Latest Promo: తేజపై విరుచుకుపడ్డ నాగ్‌.. జైలు శిక్ష తక్కువే.. నేరుగా ఇంటికి పంపించేయడమే..

Sep 30 2023 5:25 PM | Updated on Sep 30 2023 6:08 PM

Bigg Boss Telugu 7 Promo: Nagarjuna Fires on Tasty Teja - Sakshi

అన్నింటికీ బాస్‌లా పోజు కొట్టే శివాజీ సైతం నిమ్మకు నోరెత్తనట్లు ఉండటంతో అతడినీ ఏకిపారేశాడు. మీ ఇద్దరికీ కళ్లు కనబడట్లేదా? అని తిట్టిపోశాడు. 

'బిగ్‌బాస్‌ హౌస్‌లో హింసకు చోటు లేదు' ఈ నియమం ఇప్పటిది కాదు. తొలి సీజన్‌నాటి నుంచే ఈ రూల్‌ ఉంది. అయినా టాస్కులు జరిగేటప్పుడు కొన్నిసార్లు ఈ రూల్‌ బ్రేక్‌ అవుతూ ఉంటుంది. అప్పుడు నాగార్జున చేత కంటెస్టెంట్లకు కోటింగ్‌ కూడా ఉంటుంది. ఈ సారీ అదే జరిగింది. కాకపోతే ఇదేమీ కొట్టుకునేంత ఫిజికల్‌ టాస్క్‌ కాదు. అయినా తేజ బెల్ట్‌తో గౌతమ్‌ను టపాటపా కొట్టాడు. హౌస్‌లో ఉన్నవాళ్లకు ఎలా ఉందో కానీ చూసే జనాలకు మాత్రం గొడ్డును బాదినట్లు బాదాడనిపించింది.

తను కావాలని చేయకపోయినా బెల్ట్‌తో మెడపై అంత గట్టిగా కొట్టడం.. అక్కడున్నవాళ్లు వద్దని హెచ్చరిస్తూ కేకలు పెడుతున్నా తన చర్యలు ఆపకోవడం గమనార్హం. ఇలాంటి అరాచకాన్ని ప్రశ్నించేందుకు రెడీ అయ్యాడు నాగార్జున. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గౌతమ్‌ను తేజ ఎలా బాదాడో వీడియో చూపించాడు నాగ్‌. సంచాలకుడిగా ఉన్న సందీప్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడని విమర్శించాడు. అన్నింటికీ బాస్‌లా పోజు కొట్టే శివాజీ సైతం నిమ్మకు నోరెత్తనట్లు ఉండటంతో అతడినీ ఏకిపారేశాడు. మీ ఇద్దరికీ కళ్లు కనబడట్లేదా? అని తిట్టిపోశాడు. 

తర్వాత తప్పు చేసిన తేజను చెడుగుడు ఆడుకున్నాడు. అక్కడ అమ్మాయిలు భయంతో అరుస్తుంటే వినబడట్లేదా? అని నాగ్‌ ప్రశ్నించగా.. అది ఎంకరేజ్‌మెంట్‌ అనుకున్నానని నీళ్లు నమిలాడు తేజ. తేజ చేసిన తప్పుకు ఏ శిక్ష వేయాలని కంటెస్టెంట్లనే తిరిగి ప్రశ్నించాడు నాగ్‌. శుభశ్రీ.. అతడిని జైల్లో వేయాలంది. ప్రియాంక.. జైలు శిక్ష కూడా తక్కువేనంది. సందీప్‌ అయితే ఏకంగా అతడిని బయటకు పంపించేయాలన్నాడు. దీంతో తేజ తప్పు తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

చదవండి: ఓటీటీలో నిత్యా జోరు, మరో కొత్త వెబ్‌ సిరీస్‌ డేట్‌ వచ్చేసింది.. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement