బిగ్‌బాస్‌లోకి వెళ్లే ప్ర‌సక్తే లేదు: న‌టి | Bigg Boss Telugu 4: Kalpana Ganesh Says She Never Participate Bigg Boss | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ ఎంట్రీ: కొట్టిపారేసిన న‌టి

Aug 30 2020 3:22 PM | Updated on Sep 6 2020 4:53 PM

Bigg Boss Telugu 4: Kalpana Ganesh Says She Never Participate Bigg Boss - Sakshi

బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ అంటే ప‌డి చ‌చ్చే వాళ్లు చాలామందే ఉంటారు. అయితే అందులో భాగస్వా‍మ్యం కావాలంటే మాత్రం అటు సినీ సెల‌బ్రిటీలు, ఇటు టీవీ న‌టీన‌టులు ఒక‌టికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే బిగ్‌బాస్ పార్టిసిపెంట్ల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసి పాపులారిటీని రెట్టింపు చేస్తుంది. అదే స‌మయంలో ఏమాత్రం తేడా వ‌చ్చినా ఉన్న ఇమేజ్‌ను కూడా నాశ‌నం చేస్తుంది. గ‌త సీజ‌న్ల‌ను చూస్తే సినీ ప‌రిశ్ర‌మ నుంచి వ‌చ్చే సెల‌బ్రిటీల‌కు బిగ్‌బాస్ త‌ర్వాత అవ‌కాశాలు ఆగిపోయిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. హౌస్‌లోనూ వారు అప్ప‌టిదాకా సంపాదించుకున్న అభిమానం, పాపులారిటీని కాపాడుకునేందుకు ప్ర‌తిక్ష‌ణం పోరాడాల్సి ఉంటుంది. (చ‌ద‌వండి: టీవీల‌కు అతుక్కుపోయే టైమ్ వ‌చ్చేసింది)

ఈ గొడ‌వంతా ఎందుకు అనుకుందో ఏమో కానీ తాను మాత్రం ఆ గోతిలో ప‌డ‌నని న‌టి క‌ల్పిక గ‌ణేష్ క‌రాఖండిగా చెప్తోంది. బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో న‌టి క‌ల్పిక పాల్గొన‌నుందంటూ గ‌త కొంత‌కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా దీనిపై న‌టి స్పందిస్తూ అది ఎప్ప‌టికీ ఊహ‌లుగానే మిగిలిపోతాయి కానీ, నిజం కాలేవ‌ని తేల్చి చెప్పింది. ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ తాను బిగ్‌బాస్‌లో అడుగు పెట్ట‌ను అని స్ప‌ష్టం చేసింది. కాగా 'ప్ర‌యాణం' సినిమాతో వెండితెర‌పై తెరంగ్రేటం చేసిన క‌ల్పిక.. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు', 'సీత ఆన్ ద రోడ్' వంటి ప‌లు సినిమాల్లో న‌టించింది. (చ‌ద‌వండి: నా కుటుంబానికి ఇది క‌ష్ట కాలం: న‌టుడు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement