బిగ్‌బాస్ 4: గాసిప్ వార్త‌ల‌పై లేటెస్ట్ ప్రోమో

Bigg Boss Telugu 4: Stick On TV For More Gossip In Bigg Boss - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ మ‌రింత ఆల‌స్యం కానుందంటూ వ‌స్తున్న పుకార్ల‌కు స్టార్ మా చెక్ పెట్టింది. సెప్టెంబ‌ర్ 6న ఆరు గంట‌ల‌కు గ్రాండ్‌గా ప్రారంభం కానుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇన్నాళ్లు చ‌డీచ‌ప్పుడు లేకుండా ఉన్న బిగ్‌బాస్‌ ఇప్పుడు ప్రోమోల డోసు పెంచింది. టీవీల‌కు అతుక్కుపోయే టైమ్ వ‌చ్చేసిందంటూ మ‌రో ప్రోమోను వ‌దిలింది. న‌లుగురు ఆడాళ్లు ఒకేచోట ఉంటే ఏం జ‌రుగుతుంది? ప్ర‌పంచంలో జ‌రుగుతున్న విష‌యాల గురించి ప‌ట్టించుకుంటారో, లేదో కానీ ప‌క్కింటి విష‌యాల‌న్నింటినీ ఏక‌రువు పెడ‌తారు. ఈ ముచ్చ‌ట్లే తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ గురించి వివ‌రంగా చెప్పుకుంటే.. న‌లుగురు ఆడ‌వాళ్లు లిఫ్ట్ ఎక్కు‌తారు. (చ‌ద‌వండి: హీరోయిన్‌తో బిగ్‌బాస్‌ విన్నర్ పెళ్లి‌!)

వెళ్లీ వెళ్ల‌గానే హేమ వాళ్ల ఆయ‌న బెంగ‌ళూరు అని చెప్పి బ్యాంకాంక్ వెళ్లాడ‌ని చెప్పి కిసుక్కుమ‌ని న‌వ్వుతారు. ఆ త‌ర్వాత‌ క‌ళ్ల‌ద్దాలు పెట్టుకున్న ఓ మ‌హిళ అందుకుని శ్యామ‌లా కూతురు కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో ఇకఇక‌లు ప‌క‌ప‌క‌లు.. ఇలా గాసిప్స్ మాట్లాడుకుంటున్నారు. ఇంత‌లో "హ‌లో గాసిప్ గ‌ర్ల్స్‌.. ఇంత‌క‌న్నా 100 రెట్ల బెట‌ర్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నేను సెట్ చేస్తాను" అంటూ నాగ్ కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇంత‌కు ముందు ప్రోమో ద్వారా రొమాన్స్ ఉంటుంద‌ని చెప్పి, తాజా ప్రోమో ద్వారా హౌస్‌లో బోలెడ‌న్ని గాసిప్స్ దొరుకుతాయ‌ని హామీ ఇస్తున్నారు నాగ్‌. మ‌రి వాట‌న్నింటినీ చూస్తూ ఎంజాయ్ చేయాలంటే సెప్టెంబ‌ర్ ఆరు వ‌ర‌కు ఎదురు చూడాల్సిందే. (చ‌ద‌వండి: 'బిగ్‌బాస్'‌లో నందు: అది ఇది కాదు)

కాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీపై కొత్త పేరు తెర మీద‌కు వ‌చ్చింది. డ్యాన్స‌ర్‌, కొరియోగ్రాఫ‌ర్ అమ్మ రాజ‌శేఖ‌ర్ కూడా బిగ్‌బాస్‌లో పాల్గొంటున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న లిస్ట్ ప్ర‌కారం ఈ కింది పార్టిసిపెంట్లు హౌస్‌లో అడుగుపెట్ట‌నున్నారు. ర‌ఘు మాస్ట‌ర్ అండ్‌ ప్ర‌ణ‌వి, జబ‌ర్ద‌స్త్ ముక్కు అవినాష్‌, జోర్దార్ సుజాత‌, జెమిని కెవ్వు కామెడీ యాంక‌ర్ అరియానా గ్లోరీ, యూట్యూబ్ సంచ‌ల‌నం దేత్త‌డి హారిక‌, యూట్యూబ‌ర్ మొహ‌బూబా దిల్‌సే, యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి, యాంక‌ర్ లాస్య,‌ క‌రాటే క‌ళ్యాణి, నందు, సింగ‌ర్ నోయెల్‌, అమ్మ రాజశేఖ‌ర్‌, గంగ‌వ్వ‌, హీరోయిన్ మొనాల్ గజ్జ‌ర్‌, మ‌రో సీరియ‌ల్ న‌టుడు ఉన్నారు. కొంచెం అటూఇటుగానైనా వీళ్లే ఫైన‌ల్ అయిన‌ట్లు తెలుస్తోంది. (చ‌ద‌వండి: క‌రోనా వార్త‌ల‌ను కొట్టిపారేసిన నోయ‌ల్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top