అభిమానుల‌ను తిక‌మ‌క పెడుతోన్న నందు

Actor Nandu Says He Participate In BB, Shares Video - Sakshi

న‌టుడు నందు బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టనున్నాడంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు ఊపందుకున్నాయి. వీటికి మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తూ బిగ్ అనౌన్స్‌మెంట్ చేయ‌బోతున్నాన‌ని నందు ప్ర‌క‌టించాడు. అన్న‌ట్లుగానే బిగ్‌బాస్ 4 సీజ‌న్‌లో పాల్గొంటున్న‌ట్లు ఇన్‌డైరెక్ట్‌గా వెల్ల‌డించాడు. "డార్లింగ్స్ నేను బీబీలో ఉండ‌బోతున్నా... బీబీలో మ‌న ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు మీ స‌పోర్ట్ కావాలి" అంటూ ఊద‌ర‌గొట్టాడు. తాజాగా 'అది ఇది కాదు' అంటూ అభిమానుల‌ను తిక‌మ‌క పెడుతూ మ‌రో వీడియో రిలీజ్ చేశాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్‌!)

బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఒప్పుకోరు క‌దా!
ఈ వీడియోలో ఫోన్ ఎత్తిన నందు.. "బీబీ అంటే అది కాదు స‌ర్, అప్పుడు మ‌నం డిస్క‌స్ చేశామే అది. కానీ ఇది కానే కాదు.. అది మాత్ర‌మే. అదే నేనివాళ చెప్దాం అనుకున్నాను. కానీ వాళ్లేమో రేపు చెప్ప‌మంటున్నారు. నేనేమో ఇప్పుడు చెప్తా అని క‌మిట్ అయిపోయాను. కానీ, రేపు ప‌క్కా చెప్తాను" అని ముగించాడు. దీనికి 'ఇస్మార్ట్ శంక‌ర్' సినిమాలోని అది ఇది కాదు.. అదే ఇది పాట‌ను జోడించాడు. దీంతో నందు అభిమానులు మ‌రింత అయోమ‌యంలో ప‌డ్డారు. అస‌లు నందు బిగ్‌బాస్‌లో ఉన్నాడా? లేదా? అన్న సందిగ్ధంలో ప‌డిపోయారు. ఒక‌వేళ ఉంటే, ఇలా ముందే ప్ర‌క‌టించేందుకు బిగ్‌బాస్ వాళ్లు ఒప్పుకోరు క‌దా అంటూ ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు. మ‌రికొంద‌రేమో నందు బీబీలో కంటెస్టెంట్‌గా రావ‌ట్లేదు అనుకుంట అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌-4: భారీ ఆఫర్‌.. నో చెప్పిన హీరోయిన్‌?)

నందు పబ్లిసిటీ స్టంట్‌
'అన్నా.. నువ్వు అలా చెప్పేస్తే బిగ్‌బాస్ నుంచి నిన్ను తీసేస్తారు' అంటూ మ‌రికొంద‌రు టెన్ష‌న్ ప‌డుతున్నారు. నందు అభిమానులు మాత్రం 'మా ఓటు నీకే..' అంటూ ఆయ‌న ఎంట్రీ గ్యారెంటీ అని న‌మ్ముతున్నారు. అయితే బీబీ అంటే బిగ్‌బాస్ కాకుండా మ‌రేదైనా అయ్యే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా ఉంది. అత‌ని భార్య, సింగ‌ర్‌ గీతామాధురి కూడా ఇదివ‌ర‌కే బిగ్‌బాస్‌లో పాల్గొంది. కాబ‌ట్టి ఈ ప్రోగ్రాం విధివిధానాలు కూడా ఆయ‌న‌కు ఎంతోకొంత తెలిసే ఉండాలి. అందులోనూ హౌస్‌లో అడుగుపెట్టే విష‌యాన్ని కంటెస్టెంట్లు ముందే వెల్ల‌డించ‌డం పూర్తిగా నిషేధం. కాబ‌ట్టి నందు చేసే ఈ పబ్లిసిటీ స్టంట్ దేనికో తెలియాలంటే ఆయ‌నే మ‌రో అప్‌డేట్ ఇచ్చేవ‌ర‌కు వేచి చూడాల్సిందే. (చ‌ద‌వండి: సువర్ణా.. ఇన్నావా)

Update !!!

A post shared by Actor Nandu (@that_actor_nandu) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top