నా కుటుంబానికి ఇది క‌ష్ట కాలం: న‌టుడు | Gaurav Chopra Says His Parents Tests Coronavirus Positive | Sakshi
Sakshi News home page

టీవీ న‌టుడి త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా

Aug 16 2020 12:56 PM | Updated on Aug 16 2020 12:58 PM

Gaurav Chopra Says His Parents Tests Coronavirus Positive - Sakshi

టీవీ న‌టుడు గౌర‌వ్ చోప్రా.. త‌న త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా సోకిన‌ట్లు వెల్ల‌డించారు. వారిద్ద‌రూ ఢిల్లీలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. "నా కుటుంబం ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. సాధార‌ణంగా నేను వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను గురించి మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డ‌ను. కానీ క‌రోనా వైర‌స్ ఎంత‌లా వ్యాప్తి చెందుతుందనేదానిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న తీసుకురావ‌డం అత్య‌వ‌స‌ర‌మ‌నిపిస్తోంది. అందుకే చెప్తున్నా.. మూడేళ్లుగా క్యాన్స‌ర్‌తో పోరాడిన నా తల్లి ఈ మ‌ధ్యే దాన్ని జ‌యించింది. కానీ కొద్ది రోజుల క్రితం మ‌ళ్లీ అస్వ‌స్థ‌త‌కు లోనైంది. దీంతో ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా ఆమెకు క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది." (అవును 365 రోజులు.. గర్వంగా ఉంది: నటి)

"ఆమె‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్న నాన్న‌కు కూడా పాజిటివ్ అని వ‌చ్చింది. వీళ్లిద్ద‌రినీ చూసుకున్న సోద‌రుడు ప్ర‌స్తుతం కోవిడ్‌-19 ప‌రీక్ష‌ చేయించుకున్నాడు. ఫ‌లితాలు రావాల్సి ఉంది. ముంబైలో ఉన్న నేను ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధ‌ప‌డ్డాను. కానీ ఎక్క‌డ నాకు కూడా ఆ వైర‌స్ వ్యాపిస్తుందోన‌ని కుటుంబ స‌భ్యులు అక్క‌డికి రావ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. సోద‌రుడి క‌రోనా ఫ‌లితాలు రాగానే దీనిపై నేను నిర్ణ‌యం తీసుకుంటాను. ఏ క్ష‌ణ‌మైనా ఢిల్లీ వెళ్లేందుకు నేను రెడీగా ఉన్నాను" అని తెలిపారు. కాగా గౌర‌వ్.. 'దిల్ క్యా చ‌హ‌తా హై', 'అదాల‌త్'‌, 'స‌డ్డా హ‌ఖ్' వంటి ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. బిగ్‌బాస్ 10 హిందీ సీజ‌న్‌లోనూ పాల్గొన్నారు. (తనను వ్యభిచారిగా చిత్రీకరించి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement