బిగ్‌బాస్‌ రన్నరప్‌ గొప్పమనసు.. కుటుంబంతో కలిసి ఏం చేశాడంటే? | Bigg Boss 7 Telugu Runnerup Amardeep Chowdary Distributed Blankets For Poor People In Anantapur - Sakshi
Sakshi News home page

Amardeep Chowdary: దేవుడి దయతో నా శక్తిమేరకు సాయం చేస్తా: అమర్‌దీప్‌

Published Wed, Dec 20 2023 4:03 PM

Bigg Boss Runnerup Amardeep Chowdary Distributed Blankets For Poor People - Sakshi

తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఈ ఏడాది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో రైతుబిడ్డ ప్రశాంత్‌ ట్రోఫిని దక్కించుకోగా.. అమర్‌దీప్‌ రన్నరప్‌గా నిలిచాడు. అయితే బిగ్‌బాస్ ముగియడంతో ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. తాజాగా రన్నరప్‌ అమర్‌దీప్‌ తన కుటుంబంతో కలిసి సొంత జిల్లా అనంతపురం వెళ్లారు. 

అనంతపురం వెళ్లిన అమర్‌దీప్‌ తన ఫ్యామిలీతో కలిసి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ ట్రస్ట్ తరఫున పేద విద్యార్థులు, మహిళలకు దుప్పట్లు అందజేశారు. అక్కడే చిన్నపిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అమర్‌దీప్‌తో పాటు ఆయన భార్య తేజు, మదర్‌ కూడా పాల్గొన్నారు. అనంతరం అక్కడికి వచ్చన వారికి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా.. దేవుడికి నాకు ఇచ్చిన శక్తిమేరకు తప్పకుండా సాయం చేస్తూనే ఉంటానని అమర్‌దీప్ తెలిపారు. కాగా.. బిగ్ బాస్‌ షో ముగిశాక తన ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న అమర్‌దీప్‌ కారుపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. 


 

Advertisement
 
Advertisement