బిగ్‌బాస్‌ 'నబీల్‌' కొత్త కారు.. నిద్రలేని రాత్రులు గడిపానంటూ.. | Bigg Boss Fame Nabeel Afridi Buys Mahindra Luxury Car | Sakshi
Sakshi News home page

Nabeel Afridi: ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు.. కల సాకారమైందంటూ నబీల్‌ ఎమోషనల్‌

Apr 20 2025 12:00 PM | Updated on Apr 20 2025 12:29 PM

Bigg Boss Fame Nabeel Afridi Buys Mahindra Luxury Car

యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నబీల్‌ అఫ్రిది (Nabeel Afridi) కొత్త కారు కొనుగోలు చేశాడు. మహీంద్రా ఎక్స్‌యూవీ700ఏఎక్స్‌7 లగ్జరీ కారును ఇంటికి తెచ్చేసుకున్నాడు. మొత్తానికి తన సంతోషాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు కారు వీడియోను షేర్‌ చేశాడు. ఒకప్పుడు ఏడు సీటర్ల కారు గురించి కలలు కనేవాడిని.. ఇప్పుడేకంగా మహీంద్రా లగ్జరీ కారును సొంతం చేసుకున్నాను. జీరో సబ్‌స్క్రైబర్లు, జీరో ఫాలోవర్ల నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను. 

మీ వల్ల కూడా అవుతుంది
మనసు నిండా ఆలోచనలు, ఒక నోట్‌ప్యాడ్‌తో నా జర్నీ మొదలైంది. ఎన్నో కష్టనష్టాలను చూశాను. నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. ఇది కేవలం కారు మాత్రమే కాదు ఒక మైల్‌స్టోన్‌. నేను నా కలను నిజం చేసుకున్నానంటే మీరు కూడా మీ కలను సాకారం చేసుకోగలరు. ముందు కలగనండి.. దానికోసం ప్రయత్నించండి.. తర్వాత దాన్ని సాకారం చేసుకోండి అని క్యాప్షన్‌ జోడించాడు. అభిమానులు లేకపోయుంటే ఇంతదూరం వచ్చేవాడినే కాదంటూ నబీల్‌ ఎమోషనలయ్యాడు.

కొత్త కారు ధరెంతంటే?
కొత్త కారు కొన్న నబీల్‌కు ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు చెప్తున్నారు. 2025లో లాంచ్‌ అయిన ఈ మోడల్‌ కారు ధర రూ.25 లక్షల పైనే ఉందని తెలుస్తోంది. నబీల్‌ అఫ్రిది.. వరంగల్‌ డైరీస్‌ యూట్యూబ్‌ ఛానల్‌తో ఫేమస్‌ అయ్యాడు. అలా వచ్చిన గుర్తింపుతో తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో పాల్గొన్నాడు. ఈ షోలో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు.

 

 

చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement