Bigg Boss Fame Bhanu Sri Marriage Rumours Goes Viral On Social Media, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss Bhanu Sri: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్‌ భాను శ్రీ!

Sep 2 2022 3:43 PM | Updated on Sep 2 2022 5:14 PM

Bigg Boss Fame Bhanu Sri Marriage Rumours Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ ఫేం, సినీ, టీవీ నటి భానుశ్రీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు షోలకు యాంకర్‌గా చేసిన భాను టీవీ సీరియల్స్‌ కూడా నటించింది. అలాగే సినిమాల్లో  సహానటి పాత్రలు చేస్తూ నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టిన భాను ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. బిగ్‌బాస్‌ తెచ్చిపెట్టిన ఫేంతో ఆమె పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చాన్స్‌ కొట్టేసింది. ఇటీవల మౌనం, నల్లమల వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేసి ఫ్యాన్స్‌ను అలరించింది. ప్రస్తుతం నటిగా, హీరోయిన్‌గా కెరీర్‌లో బిజీ అయిపోయిన భాను అటూ  సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

చదవండి: అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్‌

తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకునే భాను పెళ్లి వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. త్వరలోనే ప్రియుడితో ఏడడుగులు వేయబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో తాను ఓ వ్యక్తి వల్లే ఇలా ఉన్నానని, హైదరాబాద్‌లో తనకంటూ ఒకరు ఉన్నారనే ధైర్యం ఇచ్చాడని చెప్పింది. ఇక తాను అతడినే పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతడితోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే భానుశ్రీ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. 

చదవండి: ‘తమ్ముడు’కి చిరంజీవి స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌

Advertisement
 
Advertisement
Advertisement