
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేటితో 51వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. శుక్రవారం(సెప్టెంబర్ 2న) ఆయన బర్త్‌డే సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ తెలిపారు. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ..
చదవండి: మహేశ్ కోసం రంగంలోకి మలయాళ విలక్షణ నటుడు!
‘తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కల్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జత చేశారు చిరు. కాగా ఆయన బర్త్‌డే సందర్భంగా పవన్ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుంచి అప్‌డేట్ వదిలింది చిత్ర బృందం. పవర్ గ్లాన్స్ పేరుతో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2022
పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు 💐శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.❤️
Happy Birthday @PawanKalyan ! pic.twitter.com/NiQsUPdF4J