కోట్ల ఆస్తిని సంపాదించిన గంగవ్వ.. మొత్తం ఎంతంటే? | Bigg Boss Contestant Gangavva Assets And Investments After Participating In Reality Show, Deets Inside | Sakshi
Sakshi News home page

BB Gangavva Assets 2024: బిగ్‌బాస్‌ తర్వాత జీవితమే మారిందన్న గంగవ్వ.. తన ఆస్తి ఎన్ని కోట్లంటే?

Sep 11 2024 9:20 PM | Updated on Sep 12 2024 11:55 AM

Bigg Boss Contestant Gangavva Assets and Investments After Reality Show

బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ అంతో ఇంత పాపులారిటీ వస్తుంది. బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన ఫేమ్‌తో కెరీర్‌ను మంచిగా బిల్డ్‌ చేసుకుని ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగినవారూ ఉన్నారు. అయితే బిగ్‌బాస్‌ షోలోనే సంచలనంగా నిలిచిన గంగవ్వ ఈ రియాలిటీ షో తర్వాత కూడా తనకు నచ్చినట్లుగా యూట్యూబ్‌ వీడియోలు చేసుకుంటూ హాయిగా జీవిస్తోంది.

ఇంటికి ఎంత ఖర్చయిందంటే?
తాజాగా ఆమె ఆస్తులు, సంపాదన గురించి మై విలేజ్‌ షో టీమ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో గంగవ్వ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ (నాలుగో సీజన్‌) తర్వాత తన జీవితం చాలా మారిందంటూ తన ఇల్లు చూపించింది. రియాలిటీ షో తర్వాతే కట్టుకున్న ఈ ఇంటికి రూ.22 లక్షలు అయిందని తెలిపింది. తనకు ఉన్న ఆవుల కోసం రేకుల షెడ్డు కూడా వేసినట్లు పేర్కొంది. అలాగే వాటి కోసం గడ్డిని కూడా పెంచుతోంది.

వ్యవసాయ భూములు
ఆవుల్ని కొని, షెడ్డు నిర్మించడానికి మొత్తం రూ.3 లక్షలు అయిందని వివరించింది. తర్వాత తను కొన్న నాలుగున్నర గుంటల పొలాన్ని చూపించింది. దీని ధర ఇప్పుడు రూ. 9 లక్షలు. అలాగే మరో చోట ఉన్న రెండున్నర ఎకరాల పొలం చూపించింది. ఇది దాదాపు రూ.75-80 లక్షలు పలుకుతోందట! ఇంకోచోట ఉన్న కమర్షియల్‌ ప్లాట్‌ చూపిస్తూ దీన్ని కొనడానికి సుమారు రూ.3 లక్షలయిందని పేర్కొంది. 

అదే తన కోరిక
మరో వ్యవసాయ భూమిని చూపిస్తూ.. ఇక్కడ 15 గుంటల భూమి ఉందని.. దీని విలువ ఏడెనిమిది లక్షల రూపాయలు ఉంటుందని తెలిపింది. మొత్తంగా తన ఇల్లు, వ్యవసాయ భూమి, కమర్షియల్‌ ప్లాట్స్‌ అంతా కలిపి కోటి 24 లక్షల విలువ చేస్తోంది. తనకంటూ ఐదు తులాల బంగారం ఉందన్న గంగవ్వ ఎప్పటికైనా 50 ఆవులను తీసుకుని వాటిని పెంచుతూ, పాలమ్ముతూ బతకాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చింది. ఇక తను సంపాదించినదాంట్లో కూతుర్లిద్దరికీ చెరో రూ.2 లక్షలు, మనవరాలి పెళ్లికి రూ.2.5 లక్షలు ఇచ్చాం.

చదవండి: నాగమణికంఠ భార్యపై ట్రోలింగ్‌.. మరీ, ఇంత ఘోరమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement