Bigg Boss 6 Telugu: Contestants Made Full Entertainment In Bigg Boss Birthday Celebrations - Sakshi
Sakshi News home page

Bigg Boss 6: సత్యను ఎత్తుకున్న శ్రీహాన్‌.. మాడిపోయిన అర్జున్‌ ముఖం

Oct 4 2022 3:44 PM | Updated on Oct 4 2022 4:26 PM

Bigg Boss Bash Of Entertainment For Bigg Boss Birthday - Sakshi

బిగ్‌బాస్‌లో నామినేషన్స్‌ హీట్‌ను కూల్‌ చేసేందుకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేశారు. బిగ్‌బాస్‌ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా హౌస్‌మేట్స్‌ తమ టాలెంట్‌తో బిగ్‌బాస్‌ను మెప్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదటగా సూర్య మిమిక్రీ చేసి అదరగొట్టాడు. ఒక ఆ తర్వాత సత్య, శ్రీహాన్‌లు రొమాంటిక్‌గా డ్యాన్స్‌ చేశారు. ఇద్దరూ డ్యూయెట​్‌ చేస్తుంటే అర్జున్‌ ముఖం మాత్రం మాడిపోయింది.

వాళ్లను చూసి బాగానే హర్ట్‌ అయినట్లున్నాడు. అసలే నామినేషన్స్‌లో సత్యతో వాదించడం రాక సెల్ఫ్‌ నామినేట్‌ అయిన అర్జున్‌ ఈరోజు ఎపిసోడ్‌లో అయినా కాసింత ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసి మెప్పిస్తాడేమో చూడాలి. ఇక గీతూకు బిగ్‌బాస్‌ చికెన్‌ తినే అవకాశం ఇచ్చాడు. ఇందుకు బదులుగా ఆమె హౌస్‌లో మాంచి గాసిప్‌ చెప్పాల్సి ఉంటుంది.

అయితే మొదటి రెండుసార్లు గాసిప్‌ చెప్పడంలో గీతూ ఫెయిల్‌ కావడంతో చికెన్‌ వాసన చూసే అవకాశం మాత్రమే ఇస్తున్నట్లు ప్రోమోలో  కనిపిస్తుంది. మరి బిగ్‌బాస్‌ బర్త్‌డే సందర్భంగా ఎవరెవరు ఎలా ఎంటర్‌టైన్‌ చేయనున్నారో చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement