బిగ్‌బాస్ 8 మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు? | Bigg Boss 8 Telugu 3rd Week Voting Updates | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: టాప్‌లో విష్ణుప్రియ.. చివర్లో మాత్రం అతడు!

Sep 18 2024 8:54 AM | Updated on Sep 18 2024 9:56 AM

Bigg Boss 8 Telugu 3rd Week Voting Updates

బిగ్‍‌బాస్ 8 అప్పుడే మూడో వారానికి వచ్చేసింది. మరీ సూపర్ కాకపోయినా ఓ మాదిరిగా పర్లేదనిపిస్తోంది. గత వారం ఊహించని విధంగా శేఖర్ భాషా ఎలిమినేట్ అవడంతో చాలా మంది షాకయ్యారు. తనకి తానుగా వెళ్లిపోయానని తర్వాత చెప్పేసరికి ఊరుకున్నారు. ఇక ఈ వారం ఓటింగ్‌లోనూ లెక్కలు మారుతున్నాయి. ఏకంగా ఇద్దరు అబ్బాయిలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

నామినేషన్స్‌లో ఎవరెవరు?
ఎప్పుడు రెండు రోజులు పట్టే నామినేషన్స్ ప్రక్రియ ఈసారి సోమవారం ఒక్కరోజులోనే తేలిపోయింది. 8 మంది లిస్టులోకి వచ్చారు. వీళ్లలో నాగమణికంఠ, యష్మీ, సీత, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్ ఉన్నారు. అయితే టీమ్ లీడర్స్‌ని ఎవరూ నామినేట్ చేయొద్దని చెప్పిన బిగ్‌బాస్.. వీళ్లలో ఒకరు నామినేషన్స్‌లో ఉండాలని చెప్పాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?)

రివర్స్ అవుద్దేమో?
అయితే నిఖిల్ ఇ‍ప్పటికే ఓసారి నామినేట్ అయ్యాడని, కాబట్టి తాను వస్తానని అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. తన గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుందని  అభయ్ నవీన్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు అదే అతడికి రివర్స్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓటింగ్ మంచి రసపట్టులో ఉంది. విష్ణుప్రియ టాప్‌లో కొనసాగుతోంది. తర్వాత వరసగా మణికంఠ, సీత, యష్మీ గౌడ, నైనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఉన్నారు.

చివర్లో పృథ్వీ కానీ
ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం అభయ్ నవీన్, పృథ్వీరాజ్ చివరి స్థానాల్లో ఉన్నారు. కానీ బిగ్‪‌బాస్‌కి పృథ్వీ కావాల్సినవాడిలా కనిపిస్తున్నాడు. లవ్ ట్రాక్ నడిపించడానికి తెగ ట్రై చేస్తున్నాడు. దీని వల్ల అభయ్ నవీన్‌కి దెబ్బ పడుతుందేమోనని అనిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమై అభయ్ బయటకొస్తే మాత్రం ఇతడంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడేమో? ఎందుకంటే ఆడియెన్స్ పల్స్ తెలుకుందామని సెల్ఫ్ నామినేట్ అ‍య్యాడు. ఏమన్నా పరిస్థితులు ఎదురు తిరిగితే మాత్రం ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఇతడే అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: Bigg Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం)

Advertisement
 
Advertisement
Advertisement