
ప్రకాశ్‌రాజ్‌ను కొట్టిన స్థలమేది? అని అడగ్గా రైతు బిడ్డ క్షణం ఆలోచించకుండా కొండారెడ్డి బురుజు ఫోటోను తీసుకెళ్లి బోర్డుపై అతికించాడు. గత కొద్ది రోజులుగా డల్‌గా కనిపిస్తు
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆట భలే రంజుగా మారింది. పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా, రీఎంట్రీ ఇచ్చిన గౌతమ్ సహా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురినీ పోటుగాళ్లుగా విభజించిన సంగతి తెలిసిందే! ఈ రెండు టీముల మధ్య వరుసగా పోటీలు పెడుతున్నాడు బిగ్‌బాస్. ఇప్పటివరకు అయిన గేమ్ ప్రకారం పోటుగాళ్లు టీమ్ లీడింగ్‌లో ఉండగా ఆటగాళ్లు కాస్త వెనకబడ్డారు. తాజాగా నేడు కూడా మరో ఆసక్తికరమైన గేమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ప్రోమో రిలీజైంది. ఇందులో బిగ్‌బాస్.. సినిమా నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలడిగాడు. కొన్ని డైలాగులు వినిపిస్తూ ఆ సమయంలో వాడిన ఆయుధాలేంటి? అని అడిగాడు. అలాగే పాటలు వినిపిస్తూ అందులో ఉన్న హీరోయిన్ ఎవరో చెప్పాలన్నారు. ఒక్కడు సినిమాలో మహేశ్‌బాబు.. ప్రకాశ్‌రాజ్‌ను కొట్టిన స్థలమేది? అని అడగ్గా రైతు బిడ్డ క్షణం ఆలోచించకుండా కొండారెడ్డి బురుజు ఫోటోను తీసుకెళ్లి బోర్డుపై అతికించాడు. గత కొద్ది రోజులుగా డల్‌గా కనిపిస్తున్న అమర్‌దీప్ ఈ ఆటలో అద్భుతంగా ఆడటమే కాక బాగా పర్ఫామ్ కూడా చేసినట్లు కనిపిస్తోంది.
శివాజీ పదేపదే నువ్వు ఆడలేవు, ఆడటం లేదు.. అంటూ అమర్ నమ్మకాన్ని దెబ్బతీస్తూ వచ్చాడు. మొదటి నుంచీ ఇలాంటి మాటలు వింటూ వస్తున్న అమర్ తనను డిఫెండ్ చేసుకోవడం కూడా మానేసి మానసికంగా కుంగిపోయాడు. ఫలితంగా ఆట మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నాడు. అయితే తాజా టాస్క్‌లో మాత్రం తనకు ఛాన్స్ రావడమే కాకుండా దాన్ని ప్రూవ్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు రైతుబిడ్డ ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జ్ లాగేసుకున్న బిగ్‌బాస్ దాన్ని తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రోమోలో అతడి షర్ట్‌కు బ్యాడ్జ్ ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది.