Bigg Boss 7 Telugu Nov 8th Highlights: ప్రియాంకకి పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బాయ్‌ఫ్రెండ్!

Bigg Boss 7 Telugu Day 66 Episode Highlights - Sakshi

బిగ్‌బాస్ షో మిగతా రోజులు ఎలా ఉన్నాగానీ 'ఫ్యామిలీ వీక్' ఉన్నప్పుడు మాత్రం అందరినీ ఒక్కటి చేస్తుంది. ప్రస్తుతం ఏడో సీజన్‌లో అదే నడుస్తోంది. మంగళవారం ఎపిసోడ్‌లో అర్జున్ భార్య, శివాజీ కొడుకు, అశ్విని తల్లి వచ్చి ఎమోషనల్ చేశారు. ఇప్పుడు మరో ముగ్గురి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నవ్వించారు, ఏడిపించారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 66 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

అమ్మ ప్రేమలో గౌతమ్
అశ్విని తల్లి వచ్చి వెళ్లడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. కాసేపటి తర్వాత గౌతమ్ తల్లి.. పంచెని హౌసులోకి పంపింది. కానీ గౌతమ్.. అది తన కోసమే అని గుర్తుపట్టలేకపోయాడు. కొంతసేపటి తర్వాత 'కన్నయ్యా' అనే పిలుపుతో అమ్మ ఎక్కడుందా అని హౌస్ అంతా తిరిగేశాడు. హౌసులోకి రాగానే ఆమెని పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. అందరినీ పలకరించిన తర్వాత కొడుకుతో చాలా మాట్లాడింది.

(ఇదీ చదవండి: రష్మిక ఫేక్‌ వీడియో.. విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్!)

'సూపర్ ఆడుతున్నావ్.. కరెక్ట్ గానే ఆడుతున్నావ్.. కానీ అక్కడక్కడా ఆలోచిస్తున్నావ్.. మాటలు కొంచెం రాకుండా చూడు.. ఏదైనా పాయింట్ అనుకుంటే దాన్నే స్ట్రాంగ్‌గా పట్టుకో, వివరణ వద్దు.. ఎక్సప్లెనేషన్ వల్ల డీవియేషన్ వస్తుంది. ఏమైద్దో అని భయం వద్దు, అమ్మ ఎప్పుడు అండగా ఉంటుంది' అని గౌతమ్ కి అతడి తల్లి ధైర్యం నింపింది. అమ్మని అందరూ మిస్ అవుతున్నారు కదా అని హౌసులోని ప్రతిఒక్కరికీ గౌతమ్ తల్లి గోరుముద్దలు తినిపించింది. ఈ సీన్ చూడటానికి చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. ఆ తర్వాత.. 'అమ్మ.. అమ్మ..' అనే పాట ప్లే చేయగా.. గౌతమ్, తల్లితో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే ఈ పాట ప్లే అవుతున్నంతసేపు శోభా, యవర్.. తల్లి గుర్తొచ్చి ఎమోషనల్ అయ్యారు. ఈ పాట వల్లో, తల్లి అనే ఎమోషనల్ వల్లనో ఏమో గానీ చూస్తున్న మీరు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం గ్యారంటీ.

హగ్స్‌-ముద్దులతో ప్రియాంక
గౌతమ్ తల్లి వెళ్లిపోయిన తర్వాత కాసేపటికి ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ శివ కుమార్‌ వచ్చాడు. రోజా ఫ్లవర్ తీసుకొచ్చి, మోకాళ్లపై వంగి మరీ ప్రియాంకకు ప్రపోజ్ చేశాడు. హగ్గులు, నుదుటిపై ముద్దులతో రెచ్చిపోయాడు. దీంతో పక్కనే ఉన్న అర్జున్.. ఏమైనా అడ్డుపెట్టాలా? అని చిన్నగా సెటైర్ వేశాడు. కాకపోతే ఈ కామెంట్ ని పట్టించుకునేంత మూడ్‌లో ఈ ప్రేమజంట లేదు. ఇన్నాళ్ల విరహవేదన వల్లో ఏమో గానీ ఒకరికి ఒకరు అతుక్కుపోయారు. కాస్త గ్యాప్ ఇచ్చి హౌస్‌మేట్స్ అందరిని ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ తెగ పొగిడేశాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వరరావు'.. అనుకున్న టైమ్ కంటే ముందే?)

హౌసులో గొడవ జరిగితే అప్పుడు దాన్ని తెగే దాకా లాగడం నచ్చట్లేదని, ఆ విషయం కాస్త చూసుకోమని ప్రియాంకకు ఆమె బాయ్‌ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. ఫ్రెండ్స్, బెస్ట్‌ఫ్రెండ్స్ ఎవరు అవసరమే లేదు నీకు అని.. అమరదీప్, శోభా గురించే ఇన్ డైరెక్ట్‌గా చెప్పాడు. కిచెన్ లోనే ఉండిపోతున్నావ్, బయటకు రా అని కూడా చెప్పాడు. 'బయటకొచ్చాక నాతో గొడవ పడతావా?' అని ప్రియాంక గోముగా అడిగేసరికి.. బాయ్‌ఫ్రెండ్ ఐస్ అయిపోయాడు. నువ్వు ఏం చెబుతావో అదే వింటానని అనేశాడు. మరి పెళ్లెప్పుడు అని ప్రియాంక అతడిని అడగ్గా.. బయటకొచ్చాక చేసుకుందాం అన్నాడు. ఇప్పుడే చేసుకుందామని ప్రియాంక.. తన విరహావేదనని అంతా బయటపెట్టేసింది. వెళ్తూ వెళ్తూ కూడా కొంతమందితో మాత్రం చూసుకుని ఉండు అని.. శోభా, అమర్ గురించి ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ చెప్పాడు. ఆ తర్వాత భోలె భార్య కూడా వచ్చింది. కాకపోతే యోగ క్షేమాలు మాట్లాడి హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. 

ఇకపోతే ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ అంటే మాత్రం ప్రియాంక-ఆమె బాయ్‌ఫ్రెండ్‌దే. గౌతమ్ తల్లి ఎమోషన్‌తో అందరితో కన్నీళ్లు పెట్టిస్తే.. ప్రియాంక ప్రియుడు మాత్రం హౌస్ మొత్తాన్ని రొమాంటిక్‌గా మార్చేశాడు. ఇక ప్రియాంక-బాయ్‌ఫ్రెండ్ పెళ్లి డిస్కషన్ చూసిన తర్వాత.. హౌస్ నుంచి బయటకెళ్లగానే ప్రియాంక పెళ్లి చేసుకోవడం గ్యారంటీ అని క్లారిటీ వచ్చేసింది. అలా బుధవారం ఎపిసోడ్ పూర్తయింది. మరి గురువారం ఎపిసోడ్‌లో ఎలాంటి ఎమోషన్స్ బయటకొస్తాయో తెలియాలంటే వెయిట్ అండ్ సీ.

(ఇదీ చదవండి: భూటాన్‌లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-11-2023
Nov 08, 2023, 15:39 IST
బిగ్ బాస్ హౌస్‌లో రోజు రోజుకు మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి వరకు నామినేషన్స్, గేమ్ టాస్కులతో బిజీగా ఉండే...
08-11-2023
Nov 08, 2023, 12:13 IST
అందరినీ దగ్గరకు తీసుకున్న ఆమె ఇంట్లో అందరికీ గోరుముద్దలు తినిపించింది. తల్లి ప్రేమను చూసి ప్రిన్స్‌ యావర్‌ ఎమోషనలయ్యాడు. దీంతో...
08-11-2023
Nov 08, 2023, 07:55 IST
మిగిలినవాళ్లు ఎంత రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోకు అని చెప్పాడు. హౌస్‌ నుంచి వెళ్లేటప్పుడు కూడా వీకెండ్‌లో నాగ్‌ సర్‌ ఇచ్చే...
07-11-2023
Nov 07, 2023, 16:55 IST
బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ -7లో మరో వారం మొదలైంది. ఇప్పటికీ తొమ్మిది వారాలు పూర్తి కాగా.. గత వారంలో...
07-11-2023
Nov 07, 2023, 13:24 IST
కోలీవుడ్‌లో జోవికా విజయ్ కుమార్ పేరు గత కొద్దరోజులుగా భారీగా ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన...
07-11-2023
Nov 07, 2023, 11:43 IST
బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 దాదాపు పది వారాలు పూర్తి కావస్తుంది. ఇక నుంచి బలమైన కంటెస్టెంట్లే హౌస్‌ నుంచి...
07-11-2023
Nov 07, 2023, 09:02 IST
బిగ్‌ బాస్‌ ఫేమ్‌  శ్వేతా వర్మ  ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఆమె...
07-11-2023
Nov 07, 2023, 01:01 IST
జ‌నాల‌కు న‌చ్చితే ఉంటాం, లేదంటే పోతాం.. అంటూ నీతులు వ‌ల్ల‌వేస్తుంటాడు శివాజీ. కానీ త‌న‌దాకా వ‌చ్చేస‌రికి మాత్రం ఎవ‌రైనా నామినేట్...
06-11-2023
Nov 06, 2023, 18:06 IST
ప్ర‌తిసారి నా నోరెత్తితే చాలు ప్రాబ్ల‌మైపోతుంది ఇక్క‌డ‌.. ఇప్పుడేంటి నువ్వు చాలా గ్రేటు.. ఇక్క‌డ కూర్చున్నవాళ్లంద‌రం వేస్ట్‌.. క‌నీసం నా...
06-11-2023
Nov 06, 2023, 16:47 IST
ఆ కంటెస్టెంట్ ఇంటికి వెళ్లి మ‌రీ పేరెంట్స్‌కు సారీ చెప్తానంటున్నాడు.  ఏ ప్ర‌శ్న‌ల‌డిగినా ట‌పీమ‌ని సమాధానాలు చెప్పుకుంటూ పోయిన తేజ...
06-11-2023
Nov 06, 2023, 08:52 IST
బిగ్‌ బాస్‌ సీజన్‌ - 7 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్‌ అయ్యాడు. 9 వారాల పాటు ఆటలొ కొనసాగిన...
06-11-2023
Nov 06, 2023, 00:00 IST
తేజ ఏమీ లేని ఆకులా ఎగిరెగిరిప‌డ‌తాడ‌ని చెప్పాడు ప్ర‌శాంత్‌. నోరు మంచిదైతే ఊరు మంచిద‌వుతుంద‌నే సామెత అశ్వినికి బాగా సూట‌వుతుంద‌ని...
05-11-2023
Nov 05, 2023, 22:17 IST
అన్నింటినీ లైట్ తీసుకుంటూ పోయే తేజ‌ను చూసి జ‌నాలు కూడా లైట్ తీసుకున్నారు. అందుకే ఈవారం అత‌డిని బిగ్‌బాస్ ఇంఇ...
05-11-2023
Nov 05, 2023, 10:55 IST
మూడో వారంలో దామిని.. నాలుగో వారంలో రతిక.. ఐదో వారంలో శుభ శ్రీ.. ఆరో వారంలో నయని.. ఏడో వారంలో...
05-11-2023
Nov 05, 2023, 10:05 IST
బిగ్ బాస్ రియాలిటీ షో అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. హిందీ బిగ్ బాస్ సీజన్-17 విజయవంతంగా కొనసాగుతోంది. ఈ...
04-11-2023
Nov 04, 2023, 23:09 IST
 గౌత‌మ్‌ను బెస్ట్ కెప్టెన్‌గా అభివ‌ర్ణించిన నాగ్ అత‌డిని బంగారంగా పేర్కొన్నాడు. శోభ, తేజ‌, అమ‌ర్‌, అర్జున్‌ను, శివాజీల‌ను సైతం బంగారం...
04-11-2023
Nov 04, 2023, 18:43 IST
ప్ప‌టినుంచి ఎక్క‌డ ఎలిమినేట్ అయిపోతానోన‌ని భ‌యంతో వ‌ణికిపోతున్నాడు తేజ‌. చివ‌ర‌కు అత‌డు అనుకున్న‌ట్లే జ‌రిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో టేస్టీ తేజ...
04-11-2023
Nov 04, 2023, 15:10 IST
బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్స్‌ అంతా కాస్త సీరియస్‌గా గేమ్స్‌ ఆడుతున్నారు. పోటీలో గెలిచేందుకు...
03-11-2023
Nov 03, 2023, 23:30 IST
కెప్టెన్ అయిందో, లేదో అర్జున్‌, తేజ ఆమెను ఏడిపించేందుకు ప్ర‌య‌త్నించారు. ఎలిమినేట్ అయి వెళ్లేట‌ప్పుడు నీ ద‌గ్గ‌రున్న కాయిన్స్ ఎవ‌రికి...
03-11-2023
Nov 03, 2023, 22:19 IST
నిజానికి రాహుల్‌-ర‌తిక పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. ఆ మేర‌కు చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. ర‌తిక ఇంట్లో కూడా చెప్పేసింది. త‌ను సంతోషంగా... 

Read also in:
Back to Top