చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ, అమ్మ అనారోగ్యంతో ఉందంటూ సందీప్‌.. | Bigg Boss Telugu 7: Contestants Receive Letters, But There Is A Twist | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: ఒకేసారి గుడ్‌ న్యూస్‌, బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్లకు విషమ పరీక్ష!

Oct 5 2023 12:55 PM | Updated on Oct 5 2023 1:16 PM

Bigg Boss 7 Telugu: Contestants Receive Letters, But There is a Twist - Sakshi

ఇప్పటికే కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే మరొకరు ఉత్తరం చదువుకోవాల్సి ఉం

బిగ్‌బాస్‌ గ్యారేజ్‌.. ఇచట అన్నిరకాల మనుషులు ఉంటారు. కోపిష్టిలు, సహనశీలులు, ఆవేశపరులు, ఆలోచనాపరులు, శక్తిమంతులు, బుద్ధిహీనులు, సహృదయులు, కఠినాత్ములు.. ఇలా భిన్నరకాల మనుషులుంటారు. హౌస్‌లోకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నా బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఎంతో కొంత నేర్చుకునే వెళ్తారు. ప్రస్తుత సీజన్‌లో ఇంటిసభ్యుల మధ్య ఆప్యాయత కన్నా కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాస్కుల్లో తెగ కష్టపడుతున్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్‌ ఈరోజు గుడ్‌న్యూస్‌, బ్యాడ్‌ న్యూస్‌ చెప్పనున్నట్లు కనిపిస్తోంది.

ఈమేరకు తాజాగా ప్రోమో విడుదలైంది. ఇందులో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు వారి ఇంటిసభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కానీ ఇప్పటికే కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే మరొకరు ఉత్తరం చదువుకోవాల్సి ఉంటుంది.  దీంతో కంటెస్టెంట్లు ఎమోషనలయ్యారు. చేతిదాకా వచ్చిన ఉత్తరాన్ని చదువుకునే భాగ్యం కూడా దక్కకుండా పోయిందేనని కొందరు ఏడ్చేశారు.

ఇక సందీప్‌..  తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని.. తనకు ఈ ఉత్తరం ఎంతో అవసరమని చెప్తాడు. మదర్‌ సెంటిమెంట్‌ అయ్యేసరికి అమర్‌ తనతో వాదించలేకపోతాడు. అటు శుభశ్రీ సైతం తనకు ఈ లెటర్‌ కావాలని ఏడ్చేసింది. ఎప్పుడూ నవ్వించే తేజ కూడా ఉత్తరాన్ని చేతిలోకి తీసుకోగానే బోరుమని విలపించాడు. మరి ఎవరెవరికి ఉత్తరం చదివే ఛాన్స్‌ వచ్చింది? ఎవరు తమ లెటర్‌ను చింపేసి త్యాగానికి సిద్ధపడ్డారు? అనేది తెలియాలంటే నేటి ఎమోషనల్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: బిగ్‌ బాస్‌ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement