ఎలిమినేషన్‌ ఎత్తేసిన బిగ్‌బాస్‌.. మరో కొత్త ట్విస్ట్‌! | Bigg Boss 7 Telugu: Buzz Is That 1st Week No Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7 Elimination: ఈ వారం ఎలిమినేషన్‌ లేనట్లేనా? హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు!

Sep 9 2023 5:03 PM | Updated on Sep 9 2023 6:41 PM

Bigg Boss 7 Telugu: Buzz Is That 1st Week No Elimination - Sakshi

హౌస్‌మేట్స్‌గా ప్రమోషన్‌ కూడా అందుకోకుండా ఎలా ఎలిమినేట్‌ అవుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు అసలు ఈ వారం ఎలిమినేషన్‌ ఉండదని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో ఆసక్తికర విషయమేంటంటే రేపు హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు అడుగుపెట్టనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇదివరకే ఫైనలైన కంటెస్టెంట్లలో కొం

బిగ్‌బాస్‌ షో మొదలై ఆరు రోజులు కావస్తోంది. నామినేషన్స్‌ అయ్యాయి, టాస్కులు అవుతున్నాయి. కానీ ఇంతవరకు ఎవరికీ హౌస్‌మేట్‌ అన్న అర్హత మాత్రం కల్పించలేదు. షో ప్రారంభంలోనే నాగార్జున నొక్కి మరీ చెప్పాడు. హౌస్‌లో అడుగుపెడుతున్నారు కానీ మీరు హౌస్‌మేట్స్‌ కాదు, కేవలం కంటెస్టెంట్లు మాత్రమేనన్నాడు. అంటే, ఇంటిసభ్యుడి/ఇంటి సభ్యురాలి స్థానం ​కోసం పోరాడి సాధించాలన్నాడు. ఈ లెక్కన ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న 14 మంది కేవలం కంటెస్టెంట్లు మాత్రమే!

వీరిలో ఎనిమిది మంది ఈ వారం నామినేట్‌ అయ్యారు. అయితే వారు ఇంకా హౌస్‌మేట్స్‌గా ప్రమోషన్‌ కూడా అందుకోకుండా ఎలా ఎలిమినేట్‌ అవుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు అసలు ఈ వారం ఎలిమినేషన్‌ ఉండదని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో ఆసక్తికర విషయమేంటంటే రేపు హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు అడుగుపెట్టనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇదివరకే ఫైనలైన కంటెస్టెంట్లలో కొందరిని చివరి నిమిషంలో పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందేగా!

వారిలో ఒకరిద్దరిని హౌస్‌లోకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బుల్లితెర నటుడు పూజా మూర్తి, ఐశ్వర్య పిస్సె, అర్జున్‌ అంబటి, సింగర్‌ భోలె షావలిలో ఎవరో ఒకరిద్దరు బిగ్‌బాస్‌ షోలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే పూజా మూర్తి పేరు బలంగా వినిపిస్తోంది. మరి నిజంగానే ఈ వారం ఎలిమినేషన్‌ ఎత్తేశారా? కొత్త కంటెస్టెంట్లు ఎప్పుడొస్తారు? ఎవరెవరు వస్తారు? అన్నది తెలియాలంటే నాగ్‌ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే!

చదవండి: అర్ధరాత్రి శివాజీ, షకీలా డ్రామా.. పిచ్చోళ్లను చేస్తున్నారా?

Advertisement
 
Advertisement
Advertisement