బిగ్‌బాస్ 7: మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్.. ఏడోవారం కూడా అమ్మాయే? | Bigg Boss 7 Telugu 7th Week Pooja Murthy Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Elimination: బిగ్‌బాస్ నుంచి వరసగా ఏడో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్!

Oct 20 2023 9:02 PM | Updated on Oct 20 2023 9:08 PM

Bigg Boss 7 Telugu 7th Week Pooja Murthy Elimination - Sakshi

బిగ్‌బాస్ 7 సీజన్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్ తప్పేలా కనిపించడం లేదు. సాధారణంగా ఆదివారం ఇంటినుంచి బయటకు పంపిస్తూ ఉంటారు. కానీ ఈసారి అది శనివారం ఉండనుందట. అలానే వరసగా ఏడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇది మాత్రం ఓ రకంగా ట్విస్ట్ అని చెప్పొచ్చు. బిగ్‌బాస్‌లో అసలేం జరుగుతోంది?

నామినేషన్స్‌లో ఏడుగురు
ఈసారి నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. పల్లవి ప్రశాంత్, అమరదీప్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, పూజామూర్తి, అశ్విని, భోలె షావళి ఈ లిస్టులో ఉన్నారు. వీళ్లలో ఓటింగ్ పరంగా చూసుకుంటే పల్లవి ప్రశాంత్, అమరదీప్ టాప్‌లో ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారా అనేది బుధవారం నుంచి చాలా సస్పెన్స్‌గా అనిపించింది.

(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్)

భోలె ఓటింగ్ ట్విస్ట్
ఇక ఈ వారం నామినేషన్స్ సందర్భంగా బూతులు, ఆడపిల్లలపై కామెంట్స్ చేసి ఇరిటేషన్ తెప్పించి భోలె.. ఈసారి ఎలిమినేట్ అయిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత అతడు ఓటు బ్యాంక్ పెంచుకుని ఏకంగా మూడో స్థానానికి వచ్చేశాడు. గౌతమ్ మాత్రం మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయాడు. నాలుగులో తేజ ఉన్నట్లు తెలుస్తోంది.

మళ్లీ అమ్మాయేనా?
ఇక చివరి రెండు స్థానాల్లో అశ్విని, పూజామూర్తి ఉన్నారు. వీళ్లలో ఓటింగ్ పరంగా చూసుకుంటే పూజాకే తక్కువ శాతం ఉంది. దీంతో ఈసారి ఆమెనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరసగా ఆరువారాలపాటు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. మళ్లీ ఇప్పుడు అమ్మాయి అని టాక్ వినిపిస్తుండటం విచిత్రంగా అనిపిస్తుంది. చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది?

(ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement