బిగ్‌బాస్‌ హౌస్‌లో దెయ్యం..  ఫైమా టాస్క్‌ గెలుస్తుందా? | Bigg Boss 6 Telugu: Devil In Bigg Boss House New Promo Released | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌లో దెయ్యం..  ఫైమా టాస్క్‌ గెలుస్తుందా?

Oct 5 2022 3:55 PM | Updated on Oct 5 2022 4:00 PM

Bigg Boss 6 Telugu: Devil In Bigg Boss House New Promo Released - Sakshi

ఫైమాకు సీక్రెట్‌ టాస్క్‌ ఇస్తే అది మెరీనా, వసంతిలు చేసినట్లు కనిపిస్తుంది. హౌస్‌మేట్స్‌ నిద్ర చెడగొట్టి అది తనమీద రాకుండా చూసుకోవాలని బిగ్‌బాస్‌ ఆదేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవాల్టి ఎపిసోడ్‌లో మెరీనా, వసంతిలు దెయ్యం గెటప్‌తో ఏకంగా ఫైమానే బయపెడతారు. ఆ తర్వాత ఇంట్లో అందరిని తమ గెటప్‌లతో నిద్ర లేపి భయపెట్టిస్తారు. ఇక సూర్య అపరిచితుడిలా గెటప్‌ వేసి ఎంటర్‌టైన్‌ చేస్తాడు. 3ఢిపరెంట్‌ క్యారెక్టర్స్‌తో​, తనదైన మ్యానరిజంతో మెప్పిస్తాడు.

సూర్యతో ఫైమా కూడా జతకలిసి మరింత ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఇక ఆ తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కి ఓ టాస్క్‌ ఇస్తాడు. కేవలం చాప్‌ స్టిక్స్‌ ఉపయోగించి లంచ్‌ పూర్తి చేయాల్సిందిగా ఆదేశిస్తాడు. దీంతో తెగ తిప్పలు పడుతూ ఇంటి సభ్యులు భోజనం చేశారు. మరి ఈ సీక్రెట్‌ టాస్కులో ఫైమా విజయం సాధిస్తుందో లేదో ఇవాల్టి ఎపిసోడ్‌లో చూద్దాం. 

Advertisement
 
Advertisement
Advertisement