Bigg Boss 6 Telugu: Bigg Boss Fires On Contestant - Sakshi
Sakshi News home page

Bigg Boss 6: కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్‌ ఫైర్‌.. షాకింగ్‌ నిర్ణయం!

Oct 18 2022 3:44 PM | Updated on Oct 19 2022 11:29 AM

Bigg Boss 6 Telugu: Bigg Boss Fires On Contestant - Sakshi

బిగ్‌బాస్‌-6లో  కెప్టెన్సీ కంటెడర్‌ టాస్కులు అంతగా పేలడం లేదు. కంటెస్టెంట్స్‌ అతిగా ఆలోచించి.. వాళ్లకు వాళ్లే కొత్త రూల్స్‌ పెట్టుకుంటున్నారు. ఫలితంగా బిగ్‌బాస్‌ ఆశించిన ఔట్‌పుట్‌ రావడంతో లేదు. ఈ వారం కూడా కంటెస్టెంట్స్‌ అలాంటి పనే చేసి బిగ్‌బాస్‌ ఆగ్రహానికి గురైయ్యారు. తొలిసారి బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులందరిపైనా ఫైర్‌ అయ్యారు. ఆట ఆడనివారు, షో నచ్చనివారు ఇంటి నుంచి వెళ్లిపోమ్మని గేట్లు ఓపెన్‌ చేశాడు. ఇంతకి బిగ్‌బాస్‌కి అంతలా కోపం తెప్పించే పని ఏం చేశారంటే..  ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా సెలెబ్రిటీ గేమ్ కండక్ట్ చేశారు.

ఈ టాస్క్ లో ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టి సినిమా పాత్రలను ఇచ్చాడు.  బాహుబలిగా రోహిత్, దేవసేనగా మెరీనా, చిరంజీవిగా రేవంత్, వెంకటేష్ గా ఆదిరెడ్డి, అతిలోక సుందరిగా ఇనయా సుల్తానా, పుష్పగా ఆర్జే సూర్య, శ్రీవల్లిగా గీతూ రాయల్, రాములమ్మగా కీర్తి భట్, బాలకృష్ణగా శ్రీహాన్, ప్రభాస్ గా రాజ శేఖర్, పవన్ కల్యాణ్ గా బాలాదిత్య ఉన్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలుస్తుంది.

ఈ గెటప్‌ ద్వారా అందరూ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించాలి. అయితే సదరు కంటెస్టెంట్స్‌ వినోదం అందించడంలో దారుణంగా విఫలం అయ్యారు. టాస్క్‌పై ఆసక్తి పెట్టకుండా.. కూర్చోని ముచ్చట్లు పెట్టారు. ఇది బిగ్‌బాస్‌ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. అందరిని గార్డెన్‌ ఏరియాలోకి పిలిచి ‘ఈ షో పట్ల ఆసక్తి లేదని మీరు నమ్మినట్లయితే.. తక్షణమే ముఖ్యద్వారం నుంచి వెళ్లిపోవచ్చు’అంటూ డోర్స్‌ ఓపెన్‌ చేశాడు. దీంతో కంటెస్టెంట్స్‌ షాకయ్యారు. బిగ్‌బాస్‌ వార్నింగ్‌కి కంటెస్టెంట్స్‌ ఎలా రెస్పాండ్‌ అయ్యారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement