Bigg Boss 5 Telugu Maanas Home Tour, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Maanas Home Tour: బిగ్‌బాస్‌-5 మానస్‌ ఇల్లు ఎంత లగ్జరీగా ఉందో..

Dec 26 2021 3:37 PM | Updated on Dec 26 2021 4:43 PM

Bigg Boss 5 Maanas Home Tour Video Goes Viral - Sakshi

Bigg Boss 5 Maanas Home Tour Video Goes Viral: బిగ్‌బాస్‌ సీజన్‌-5 ఫేమ్‌ మానస్‌ గురించి పరిచయం అవసరం లేదు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన మానస్‌ బుల్లితెరపై కూడా సత్తా చాటాడు. బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్‌ అయ్యాడు. గేమ్‌ పరంగానే కాకుండా మెచ్యూర్డ్ థింకింగ్ తో అటు కుటుంబ ప్రేక్షకుల్ని ఇటు యువతని అమితంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సన్నీ, మానస్‌ల ఫ్రెండిప్‌కి ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ ఉన్నారు.

బిగ్‌బాస్‌లో టాప్‌-4గా నిలిచిన మానస్‌కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్‌ విశేషాలను 'హోంటూర్‌'(Home tour)ద్వారా తల్లి పద్మజ వివరించింది. మానస్‌ సొంత డబ్బులతో ఇంటిని కొన్నామని, చిన్నప్పుడు హీరో సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన మానస్‌కు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నుంచి నంది అవార్డు వచ్చిందని తెలిపారు. ఎంతో అందమైన, విలసవంతమైన మానస్‌ ఇంటిని మీరు కూడా చేసేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement