త్వరలో భోళా మానియా | Bhola Shankar hits theaters on August 11 | Sakshi
Sakshi News home page

త్వరలో భోళా మానియా

May 31 2023 3:34 AM | Updated on May 31 2023 3:34 AM

Bhola Shankar hits theaters on August 11 - Sakshi

‘భోళా శంకర్‌’ ఆగస్ట్‌ 11న థియేటర్‌కి రానున్న విషయం  తెలిసిందే. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడే సమయానికి ప్రమోషన్స్‌  ఆరంభించాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ముందుగా మ్యూజికల్‌ జర్నీప్రా రంభిస్తారు. ఆ విషయాన్ని తెలియజేసి, ‘భోళా మానియా త్వరలోప్రా రంభమవుతుంది’ అంటూ, చిత్రకథానాయకుడు చిరంజీవి రెండు చేతులను వెనక జేబులో పెట్టుకొని ఉన్న డ్యాన్స్‌ మూమెంట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు.

మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిపొంస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా, ఆయన సోదరి పాత్రలో కీర్తీ సురేష్‌ కనిపిస్తారు. ‘‘మాసివ్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్‌’. కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్, భారీ సెట్‌ సాంగ్‌ బ్యాలెన్స్‌ ఉన్నాయి. జూన్‌  నెలాఖరకు షూటింగ్‌ పూర్తవుతుంది. పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కూడా  శరవేగంగా జరుగుతున్నాయి. మహతి స్వరసాగర్‌ ఈ చిత్రానికి మంచి పాటలు ఇచ్చారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement