శేఖ‌ర్‌, సందీప్ మాస్ట‌ర్ సంపాద‌న ఎంతో తెలుసా? ఒక్క సంగీత్‌కు.. | Basheer Master Shocking Comments About Choreographer Sekhar Master Remuneration, Deets Inside - Sakshi
Sakshi News home page

Sekhar Master-Basheer Master: భారీగా సంపాదిస్తున్న శేఖ‌ర్ మాస్ట‌ర్‌.. ఒక్క సంగీత్ కోసం..

Published Tue, Jan 16 2024 3:13 PM

Basheer Master About Choreographer Sekhar Remuneration - Sakshi

ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉన్న‌త స్థాయికి చేరుకున్న‌వాళ్ల‌లో శేఖ‌ర్ మాస్ట‌ర్ ఒక‌రు. రాకేశ్ మాస్ట‌ర్ ద‌గ్గ‌ర డ్యాన్స్ నేర్చుకున్న ఇత‌డు త‌ర్వాతి కాలంలో గురువును మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో పెద్ద‌ హీరోల‌తో స్టెప్పులేయిస్తూ టాప్ కొరియోగ్రాఫ‌ర్‌గా రాణిస్తున్నాడు. రాకేశ్ మాస్ట‌ర్ ద‌గ్గ‌ర శిష్యుడిగా చేరి డ్యాన్స్‌లో మెళ‌కువ‌లు నేర్చుకున్న మ‌రో వ్య‌క్తి బ‌షీర్ మాస్ట‌ర్‌. తాజాగా ఇత‌డు ఓ ఇంట‌ర్వ్యూలో శేఖ‌ర్ మాస్ట‌ర్‌ అందుకునే పారితోషికాన్ని బ‌య‌ట‌పెట్టాడు.


బ‌షీర్ మాస్ట‌ర్‌

నేను ల‌క్ష తీసుకుంటా
బ‌షీర్ మాస్ట‌ర్‌ మాట్లాడుతూ.. 'సంగీత్ వేడుక‌ల కోసం నేను ఐదు రోజులపాటు కొరియోగ్ర‌ఫీ చేసి రూ.1 ల‌క్ష తీసుకుంటాను. అదే అమెరికా వాళ్ల‌కు ఆన్‌లైన్‌లో ఒక్క పాట‌కు డ్యాన్స్ నేర్పించినందుకుగానూ రూ.30 వేలు తీసుకుంటాను.  నా పార్ట్‌టైమ్ సంపాద‌న ఇదే! ఇప్పుడున్న కొరియోగ్రాఫ‌ర్లంద‌రూ ఇలా సంగీత్ వేడుక‌లు చేసిన‌వారే!

సందీప్ కూడా..
శేఖ‌ర్ మాస్ట‌ర్  ఒక్క సంగీత్‌ కోసం రూ.40 ల‌క్ష‌లు తీసుకుంటాడు. జానీ మాస్ట‌ర్‌, స‌త్య మాస్ట‌ర్‌, సందీప్ అంద‌రూ సంగీత్‌ల‌లో చేసిన‌వారే! మొన్న‌టివ‌ర‌కు సందీప్ కూడా రూ.2-3 ల‌క్ష‌ల‌కు సంగీత్‌ చేశాడు. నాక్కూడా మంచి రేంజ్ వ‌చ్చిన‌ప్పుడు రూ.50 ల‌క్ష‌లు తీసుకుంటాను. బిగ్‌బాస్‌ షోలో పాల్గొన‌డానికి నాకు ఎటువంటి అభ్యంత‌రం లేదు. ఛాన్స్ వ‌స్తే వెళ్తానేమో, అంతా ఆ దేవుడి చేతిలో ఉంది' అని చెప్పుకొచ్చాడు.

చ‌ద‌వండి: డిసెంబ‌ర్‌లో న‌టుడి మ‌ర‌ణం.. మృత‌దేహాన్ని తీసుకెళ్లేందుకు రాని ఫ్యామిలీ!

whatsapp channel

Advertisement
 
Advertisement