2డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ చేశాం: 'బెనారస్' డైరెక్టర్

‘‘బనారస్’ కేవలం టైమ్ ట్రావెల్ సినిమా కాదు. ప్రేమకథ, థ్రిల్లర్, పునర్జన్మ అంశాలు కూడా ఉంటాయి. స్క్రీన్‌ప్లే చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అని డైరెక్టర్ జయతీర్థ (‘బెల్ బాటమ్’ ఫేమ్) అన్నారు. జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో జంటగా నటించిన చిత్రం ‘బనారస్’. తిలకరాజ్ బల్లాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న రిలీజవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నాంది’ సతీష్ వర్మ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా జయతీర్థ మాట్లాడుతూ– ‘‘నేను ఇప్పటివరకూ ఏడు సినిమాలు చేస్తే నాలుగు కొత్తవారితోనే చేశాను. నేను యాక్టింగ్ టీచర్‌ని. ఇప్పటివరకూ నేను శిక్షణ ఇచ్చి, లాంచ్ చేసిన నటీనటులు మంచి స్థాయిలో ఉన్నారు. జైద్ ఖాన్ కూడా గొప్ప స్థాయికి వెళ్తాడు. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ బనారస్‌లోనే చేశాం. 2, 3 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూట్ చేయడం సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం ‘కైవ’అనే సినిమా చేస్తున్నాను.. జనవరిలో ‘బెల్ బాటమ్ 2’ మొదలవుతుంది’’ అన్నారు.
మరిన్ని వార్తలు