సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్ | Balakrishna Super Hero Unstoppable 4 Teaser | Sakshi
Sakshi News home page

Balakrishna: సూపర్‌హీరో గెటప్ కోసం కష్టపడ్డారు.. కానీ?

Oct 12 2024 3:29 PM | Updated on Oct 12 2024 4:05 PM

Balakrishna Super Hero Unstoppable 4 Teaser

రెండు రోజుల క్రితం హీరో బాలకృష్ణ గురించి ఓ వార్త బయటకొచ్చింది. సూపర్ హీరోలా నటిస్తారనే టాక్ వినిపించింది. అయితే ఇదంతా తర్వాత చేయబోయే సినిమా కోసం ఏమోనని అభిమానులు, నెటిజన్లు అనుకున్నారు. కానీ అదంతా 'అన్‌స్టాపబుల్ 4' కోసమని ఇప్పుడు తేలింది. దసరా సందర్భంగా నాలుగో సీజన్‌కి సంబంధించిన ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య.. సూపర్ హీరోగా కనిపించాడు.

(ఇదీ చదవండి: పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?)

కంటెంట్ పరంగా చూస్తే నాలుగున్నర నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో బాగుంది. కానీ సూపర్ హీరో పాత్రని యానిమేటెడ్ వేషంలో చూపించినప్పుడు.. దీనికి బాలయ్య గొంతు అయితే నప్పింది గానీ ఫేస్ కట్ విషయంలో ఎక్కడా బాలకృష్ణలా అనిపించలేదు. ఎవరో వ్యక్తికి ఈయన డబ్బింగ్ చెప్పినట్లు అనిపించింది. చివర్లో యధావిధిగా కనిపించిన బాలయ్య.. అన్‌స్టాపబుల్ షో కొత్త సీజన్ గురించి ప్రకటించారు.

'అన్‌స్టాపబుల్' తొలి సీజన్ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. బాలకృష్ణలో కొత్త యాంగిల్‌ని ఆవిష్కరించింది. కానీ రెండు, మూడో సీజన్లు మాత్రం అనకున్నంత సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈసారి వేరే లెవల్ ఉండబోతుందని చెప్పారు. అక్టోబరు 24 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. మరి బాలకృష్ణ చెప్పినట్లు ఉంటుందా? అనేది చూడాలి. తొలి ఎపిసోడ్‌కి దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' టీమ్ రాబోతుంది.

(ఇదీ చదవండి: సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్‌'.. దిల్‌ రాజు ప్రకటన)

Advertisement
 
Advertisement
Advertisement