Balakrishna Movie Jai Simha Actress Natasha Engagement Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Natasha Doshi Engagement Photos Viral: లవ్ మ్యారేజ్‌ చేసుకుంటున్న 'జైసింహా' హీరోయిన్!

Jul 16 2023 1:21 PM | Updated on Jul 16 2023 3:47 PM

Balakrishna Movie Jai Simha Actress Natasha - Sakshi

టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ, నయనతార నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రంలో మరో నటి హీరోయిన్‌గా కనిపించింది. మలయాళ చిత్రం మాంత్రికన్‌తో ఎంట్రీ ఇచ్చిన ముంబయి ముద్దుగుమ్మ నటాషా దోషి ఆ తర్వాత తెలుగులో కోతల రాయుడు చిత్రంలో నటించింది. తాజాగా ఈ ముంబయి భామ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. 'ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో నటాషా లవ్‌ మ్యారేజ్ చేసుకుంటున్నట్లు తెలుస్తంది. ఇది చూసిన నటాషా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. 

(ఇది చదవండి: ఆ దర్శకుడికి కలిసొచ్చిన హీరోయిన్.. దక్షిణాదిలోనే భారీ రెమ్యునరేషన్‌!)

అమ్మ కుట్టి పాటకు అదరగొట్టింది

జై సింహా చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటాషా. ఈ చిత్రంలో సినిమాలో 'అమ్మ కుట్టి' పాటకు స్టెప్పులతో అదరగొట్టింది. అంతకుముందు మలయాళంలో నాలుగు సినిమాల్లో నటించింది. జైసింహా తర్వాత  శ్రీకాంత్ సరసన 'కోతల రాయుడు'లో కనిపించింది. అంతే కాకుండా కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'ఎంత మంచివాడవురా' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. 

(ఇది చదవండి: 'సౌందర్య చనిపోలేదు.. ఆ రూపంలో ఇంకా బతికే ఉంది')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement