చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్‌ | Sakshi
Sakshi News home page

ముద్దు పెట్టకుంటానన్న రిపోర్టర్‌.. చెప్పు తెగుతుందన్న హీరోయిన్‌

Published Sun, Jul 9 2023 11:16 AM

Baby Movie Team With Suresh Kondeti Vaishnavi Slapped Answer - Sakshi

విజయ్‌ దేవరకొండ  సోదరుడు, నటుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా బేబీ సినిమా జులై 14న విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాకు సాయి రాజేశ్‌ దర్శకుడు కాగ ఎస్‌కేఎన్‌ నిర్మాతగా ఉన్నారు. విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ట్రైలర్‌ కూడా విడుదలైంది. ఇందులో హీరోయిన్‌ పాత్ర డీగ్లామర్‌ రోల్‌లో ఉంటుంది. దీంట్లో ఆమెను బేబమ్మ అని పిలుస్తారట.

(ఇదీ చదవండి: Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ 7 నుంచి పిలుపొచ్చిందన్న నచ్చావులే హీరోయిన్‌)

ట్రైలర్‌ను చూసిన వారు  నలుపు, తెలుపు శరీర రంగును ఉద్దేశించేలా తెరకెక్కిన ‘బేబీ’ లాంటి సినిమాలను ఇంకా చూడాలా అంటూ పలు విమర్శలు కూడా వచ్చాయి. చివరకు ఫెయిర్‌ అండ్‌ లవ్లీ కూడా తన పేరును గ్లో అండ్‌ లవ్లీగా మార్చుకుంది. అలాంటిది ఈ సినిమా కథ ఏమిటంటూ పలు కామెంట్లు వచ్చాయి. దీనికి హీరో ఆనంద్‌ కూడా రియాక్ట్‌ అయి సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందామన్నాడు. అంతలా సినిమా విడుదలకు ముందే కొంతమేరకు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది ఈ సినిమా

 

తాజాగా చిత్ర యూనిట్‌తో ఒక రిపోర్టర్‌ ఇంటర్వ్యూ నిర్వహించారు.  అందులో భాగంగా 'బేబీ' సినిమా హీరోయిన్‌తో.. 'వైష్ణవి.. ముద్దు పెట్టుకుంటా' అని కొంచెం డిఫరెంట్‌గా అడుగుతాడు. దీంతో వైష్ణవికి ఫీజులు ఎగిరిపోయినంత పని అయింది. చివరకు ఏమనాలో తెలియకుండా కొద్దిసేపు అలాగే ఉండిపోతుంది.

వెంటనే ఆ రిపోర్టర్‌ కలుగచేసుకుని ఈ సినిమాలో హీరో అడిగిన ప్రశ్న ఇదే కదా.. 'సినిమాలో హీరో ముద్దు పెట్టుకుంటా అన్నాడు కదా..' దానికి మీ రియాక్షన్‌ ఏంటి..? ' అంటూ తనదైన స్టైల్‌లో మార్చేస్తాడు. అప్పుడు వైష్ణవి కూడా  ఓహ్‌... టీజర్‌లో ఉన్న సీన్‌ గురించా అంటూ.. గుర్తుతెచ్చుకుని 'చెప్పు తెగుద్ది అంటాను' అని అంటుంది.  'ఓహో చెప్పు తెగుద్దా' అంటూ వేరే టాపిక్‌లోకి వెళ్తాడు ఆ రిపోర్టర్‌.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌ కే' టీషర్ట్‌ కావాలంటే ఉచితంగా ఇలా బుక్‌ చేసుకోండి)

బహాశా ఇది సినిమా ప్రమోషన్‌ కోసం చేసి ఉంటారో... అనుకోకుండా నిజంగానే జరిగిందో మాత్రం తెలియదు. కానీ సోషల్‌ మీడియాలో ఆ రిపోర్టర్‌ను మాత్రం విపరీతమైన ట్రోల్‌ చేస్తున్నారు. ఆ వీడియో కింద కామెంట్లు చేయడమే కాకుండా ఆయనకు ట్యాగ్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో  2018 మూవీ ప్రెస్ మీట్‌లో కూడా ఇలాంటి వైరల్‌ కామెంట్లే చేశాడు. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆదే రిపోర్టర్‌పై మండిపడ్డారు. ఇలా ఎన్నో సంఘటనలు ఆయన ఖాతాలో ఉన్నాయి.


 

Advertisement
 
Advertisement