O Saathiya: యూత్‌ను అట్రాక్ట్‌ చేస్తున్న ఓ సాథియా సాంగ్‌

Aryan Gowra, Mishti Chakravarty O Saathiya Lyrical Video Out Now - Sakshi

మంచి సంగీతం సినిమాకు ఎంతగానో ప్లస్‌ అవుతుంది. పాటలు బాగుంటే, సంగీతానికి మంచి ఆదరణ లభిస్తే సినిమాలు హిట్ అవుతాయన్న నమ్మకం కూడా ఉంది. ఇకపోతే ప్రేమ పాటలు, మెలోడీ పాటలు జనాలకు ఎప్పుడూ ఇట్టే నచ్చేస్తుంటాయి. అలాంటి చక్కటి మెలోడి గీతాలతో, మంచి ప్రేమ కథతో ఓ సాథియా అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఓ సాథియా అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. 

ఓ సాథియా సినిమాలో ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్యన్ గౌర.. అంతకు ముందు జీ జాంబీ అనే చిత్రం చేశారు. ఇప్పుడు ఆయన హీరోగా రెండో సినిమాగా ఓ సాథియా రాబోతోంది. రాజ్య సభ సభ్యుడు, లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు ఆడియెన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. 

మెలోడీ బ్రహ్మ మణిశర్మ చేతుల మీదగా రీసెంట్‌గా విడుదల చేసిన ఓ సాథియా టైటిల్ సాంగ్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. వన్ మిలియన్ వ్యూస్‌కు చేరువలో ఉన్న పాటలో.. భాస్కర భట్ల సాహిత్యం, విన్ను అందించిన బాణీ, జావెద్ అలీ గాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్ చూస్తే సినిమాను ఎంత రిచ్‌గా తీశారో అర్థమవుతుంది. ఈజే వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

చదవండి: అర్ధరాత్రి ఇంటి నుంచి గెంటేశారు: నటుడి భార్య

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top