Nawazuddin Siddiqui Mother Files Complaint Against Aaliya Siddiqui, Know Details Inside - Sakshi
Sakshi News home page

Aaliya Siddiqui: అర్ధరాత్రి దిక్కుతోచని స్థితిలో ఇంటికెళ్తే గెంటేశారు.. నా కొడుకు గురించి దారుణంగా

Jan 23 2023 4:48 PM | Updated on Jan 23 2023 5:55 PM

Nawazuddin Siddiqui Mother Files Complaint Against Aaliya Siddiqui - Sakshi

నా రెండో బిడ్డ అతడికి పుట్టలేదంటూ అతడి తల్లి దారుణంగా మాట్లాడింది. అర్ధరాత్రి దిక్కుతోచని స్థితిలో నా భర్త ఇంటికి వెళ్లాను. కానీ అత్తయ్య మెహ్రునిసా, ఆడపడుచు శాబా.. నన్ను ఇంట్లో అడుగుపెట్టనివ్వలేదు.

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, భార్య ఆలియా సిద్దిఖీ మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. విడాకుల దాకా వెళ్లిన ఈ జంట చివరి నిమిషంలో పిల్లల కోసం ఆలోచించి మనసు మార్చుకున్నారు. అయితే కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఆలియా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో చివరికి భర్త గూటికి చేరాలని నిర్ణయించుకుంది. కానీ ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదని అతడి తల్లి అడ్డు చెప్తోందని బోరున ఏడ్చేసింది ఆలియా.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా ఆర్థిక పరిస్థితి ఏమీ బాలేదు. కనీసం దుబాయ్‌కు వెళ్లడానికి కూడా పాస్‌పోర్ట్‌ లేదు. అందుకని అర్ధరాత్రి దిక్కుతోచని స్థితిలో నా భర్త ఇంటికి వెళ్లాను. కానీ అత్తయ్య మెహ్రునిసా, ఆడపడుచు శాబా.. నన్ను ఇంట్లో అడుగుపెట్టనివ్వలేదు. బయటకు వెళ్లిపోమని గొడవ చేశారు. పోలీసులను పిలిపించి నన్ను గెంటేయడానికి ప్రయత్నించారు. రాత్రిపూట నాకు ఒక దుప్పటి కూడా ఇవ్వలేదు. నేను నవాజ్‌ విడాకులు తీసుకున్నామని, నా రెండో బిడ్డ అతడికి పుట్టలేదంటూ అతడి తల్లి దారుణంగా మాట్లాడింది.

పైగా ఇప్పుడు నామీదే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవాజుద్దీన్‌తో మాట్లాడదామంటే అతడు ఫోన్‌ కలవట్లేదు. నేను దుబాయ్‌ నుంచి వచ్చాక మా ఫ్రెండ్స్‌ రూమ్‌లో ఉన్నాను. నాకు అపెండెక్స్‌ ఆపరేషన్‌ జరిగి ఆస్పత్రిలో ఉంటే చూడటానికి కూడా ఎవరూ రాలేదు' అని వాపోయింది ఆలియా. కాగా ఆలియా తమ ఇంట్లోకి చొరబడటమే కాక బెదిరింపులకు పాల్పడిందంటూ నవాజుద్దీన్‌ సిద్దిఖీ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆమెకు సోమవారం ఉదయం సమన్లు జారీ చేశారు.

చదవండి: పెళ్లిపీటలెక్కనున్న సీరియల్‌ నటి
పారిపోయి పెళ్లి చేసుకున్నాం.. బతికున్నాడో, లేదో కూడా తెలీదు: నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement